close

Published : 21/04/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్పుత్నిక్‌ వి ధర రూ.750?

మేలో అందుబాటులోకి రష్యా నుంచి నేరుగా దిగుమతి
ఆ తర్వాత దేశీయంగా తయారీ

రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ ఆవిష్కరించిన కొవిడ్‌-19 టీకా, ‘స్పుత్నిక్‌ వి’ మే నెలాఖరు నాటికి మనదేశంలో అందుబాటులోకి రానుంది. తొలిదశలో ఈ టీకాను రష్యా నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌ దిగుమతి చేసుకుని దేశీయంగా పంపిణీ చేస్తుంది. ‘సాధ్యమైనంత త్వరగా టీకా పంపాలని ఆర్‌డీఐఎఫ్‌ను కోరుతున్నాం. మే నెలాఖరు లేదా ఆపై జూన్‌ మొదటి వారంలో టీకా రావచ్చు’ అని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఎండీ జీవీ ప్రసాద్‌ వెల్లడించారు. టీకా నిల్వ, పంపిణీకి అన్ని  ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ‘స్పుత్నిక్‌ వి’ టీకా ధర మనదేశంలో రూ.750 (10 డాలర్లు) ఉండొచ్చని తెలుస్తోంది. ‘అన్ని దేశాల్లో ఈ టీకాను 10 డాలర్లకు ఆర్‌డీఐఎఫ్‌ విక్రయిస్తోంది, మనదేశంలోనూ అదే ధర ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.
జులై-సెప్టెంబరులో దేశీయ తయారీ
దేశీయంగా తయారైన ‘స్పుత్నిక్‌ వి’ టీకా జులై- సెప్టెంబరు త్రైమాసికంలో అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. మనదేశానికి చెందిన అయిదు కంపెనీలతో ఇప్పటికే ఆర్‌డీఐఎఫ్‌ తయారీ ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం విదితమే. హెటిరో ఫార్మా, పానేషియా బయోటెక్‌, విర్కో బయోటెక్‌, గ్లాండ్‌ ఫార్మా, స్టెలిస్‌ బయో కంపెనీలు ఇందులో ఉన్నాయి. దాదాపు 60- 70 శాతం టీకాను రష్యా నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు, మిగిలిన టీకా మనదేశంలోనే తయారవుతుందని డాక్టర్‌ రెడ్డీస్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఒకటి రెండు దేశీయ కంపెనీల నుంచి స్పుత్నిక్‌ వి టీకా సరఫరా అవుతుందని భావిస్తున్నారు.

రెమ్‌డెసివిర్‌ సరఫరా పెంచుతున్నాం
‘రెమ్‌డెసివిర్‌’ మందు కొరత వచ్చే కొద్ది వారాల్లో తీరే అవకాశం ఉందని జీవీ ప్రసాద్‌ వివరించారు. ఈ మందు తయారు చేస్తున్న కంపెనీల్లో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒకటి. వచ్చే వారం నుంచి తాము ‘రెమ్‌డెసివిర్‌’ సరఫరా పెంచుతామని అన్నారు. యాంటీ-వైరల్‌ ఔషధమైన ‘ఫావిపిరవిర్‌’ ఎంత కావాలంటే అంత లభిస్తోందని, ఈ మందుకు పెద్దగా గిరాకీ లేదని పేర్కొన్నారు.

 

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని