+529 నుంచి -244కు
close

Published : 21/04/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

+529 నుంచి -244కు

సమీక్ష

సూచీల నష్టాలు రెండో రోజూ కొనసాగాయి. బ్యాంకింగ్‌, ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో ఆరంభ జోరుకు కళ్లెం పడింది. కొవిడ్‌-19 కేసులు, స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్‌లు మదుపరి సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలూ తోడయ్యాయి. దీంతో  సెన్సెక్స్‌ చివరకు 243.62 పాయింట్ల నష్టంతో 47,705.80 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌కు ఇది దాదాపు రెండు నెలల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. నిఫ్టీ  63.05 పాయింట్లు కోల్పోయి 14,296.40 దగ్గర స్థిరపడింది.  
* సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 డీలాపడ్డాయి. అల్ట్రాటెక్‌ అత్యధికంగా 4.70 శాతం కుదేలైంది. హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యునిలీవర్‌, ఐటీసీ 3.56 శాతం వరకు నష్టపోయాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.70%, డాక్టర్‌ రెడ్డీస్‌ 3.69%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.95%, బజాజ్‌ ఆటో 2.02%, ఎం అండ్‌ ఎం 1.97% లాభపడ్డాయి.
నేడు మార్కెట్లకు సెలవు
శ్రీరామ నవమి సందర్భంగా నేడు (బుధవారం) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. బులియన్‌, ఫారెక్స్‌, కమొడిటీ మార్కెట్లు కూడా పని చేయవు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని