ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేత: హీరో మోటో
close

Published : 21/04/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేత: హీరో మోటో

దిల్లీ: కొవిడ్‌-19 కేసుల విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని తయారీ ప్లాంట్లలో కార్యకలాపాలను ఏప్రిల్‌ 22 నుంచి మే 1 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. రాజస్థాన్‌లోని నీమ్రానాలో ఉన్న గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌ (జీపీసీ) సైతం మూసివేస్తున్నట్లు తెలిపింది. కంపెనీకి ఆరు తయారీ కేంద్రాలు ఉన్నాయి. స్థానిక పరిస్థితుల బట్టి ఏప్రిల్‌ 22 నుంచి మే 1 మధ్య దశలవారీగా ప్రతిప్లాంట్‌, జీపీసీని నాలుగు రోజుల పాటు మూసివేస్తున్నట్లు హీరో మోటోకార్ప్‌ వెల్లడించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని