కొత్త రుణగ్రహీతలకూ క్రెడిట్‌ స్కోరు
close

Published : 21/04/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త రుణగ్రహీతలకూ క్రెడిట్‌ స్కోరు

ఎన్‌టీసీని ప్రారంభించిన ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌

ఈనాడు, హైదరాబాద్‌:  కొత్తగా అప్పు కోసం దరఖాస్తు చేసుకునేవారిపై బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు ఒక అవగాహనకు వచ్చేందుకు వీలుగా క్రెడిట్‌ విజన్‌ న్యూ టు క్రెడిట్‌ (ఎన్‌టీసీ) స్కోరు అందుబాటులోకి తెస్తున్నట్లు ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ వెల్లడించింది. ఈ ఎన్‌టీసీతో వినియోగదారుల అర్హతను నిర్ణయించడం రుణదాతలకు సులువు అవుతుందని పేర్కొంది. ఎలాంటి అప్పులు లేని వారికి క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్రలాంటివి ఉండవు. కాబట్టి, అలాంటి వారి గురించి అంచనా వేయడం రుణ సంస్థలకు చిక్కుగానే ఉంటుంది. ఈ కొత్త స్కోరింగ్‌ను వినియోగదారుడి గురించి అందుబాటులో ఉన్న వివిధ సమాచారం ఆధారంగా నిర్ణయిస్తారు. ఇది 101-200 శ్రేణిలో ఉంటుంది. అత్యధిక విలువ ఉంటే తక్కువ రిస్క్‌ ఉన్నట్లు. స్వల్ప స్కోరు ఉంటే.. రుణగ్రహీత చెల్లింపు జరపలేకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడిస్తుంది. ఈ స్కోరు క్రెడిట్‌ సంస్థలు, బ్యాంకులు ఉపయోగించుకునేందుకు వీలుంటుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని