close

Updated : 22/04/2021 12:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విదేశీ పెట్టబడులు.. రూ.40,00,000 కోట్లు

మన స్టాక్‌ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ 
దేశీయ సంస్థాగత మదుపర్లది ఇందులో సగం కంటే తక్కువే 
బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌  

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో (ఎఫ్‌పీఐలు) మదుపర్ల పెట్టుబడుల విలువ గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) 555 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.40,00,000 కోట్లు)కు చేరింది. 2020 సెప్టెంబరు నుంచి 2021 మార్చి మధ్య ఈ విలువ 105 బిలియన్‌ డాలర్లు పెరిగిందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌  నివేదిక తెలిపింది. దేశీయ సంస్థాగత మదుపర్ల పెట్టుబడుల విలువ 2020-21 చివరినాటికి 203 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.15,00,000 కోట్లు) ఉంది. ఎఫ్‌పీఏల పెట్టుబడుల విలువలో ఇది సగం కంటే తక్కువే. ప్రస్తుత ఏడాదిలో ఏప్రిల్‌ 16 వరకు చూస్తే, ఎఫ్‌పీఐలు నికరంగా 7.2 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టారు. జనవరిలో 2.2 బిలియన్‌ డాలర్లు, ఫిబ్రవరిలో 3.5 బిలియన్‌ డాలర్లు, మార్చిలో 3.5 బిలియన్‌ డాలర్లు చొప్పున విదేశీ మదుపర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. తద్వారా ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ మదుపర్లు నికరంగా పెట్టుబడుల పెట్టిన ఏకైక దేశంగా భారత్‌ నిలిచింది. ఇతర వర్ధమాన విపణులన్నింటి నుంచి ఎఫ్‌పీఐలు పెట్టుబడులను నికరంగా వెనక్కితీసుకోవడం గమనార్హం. దేశీయ ఈక్విటీ మార్కెట్లు రాణించడంలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయనే విషయం తెలిసిందే.

2020-21లో రూ.2.75 లక్షల కోట్లు 

మన స్టాక్‌ మార్కెట్లలో గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఎఫ్‌పీఐలు 37 బిలియన్‌ డాలర్లు (రూ.2.75 లక్షల కోట్లు) పెట్టుబడిగా పెట్టారు. రెండు దశాబ్దాల కాలంలో ఎఫ్‌పీఐలు ఒక ఆర్థిక సంవత్సరంలో పెట్టిన అత్యధిక పెట్టుబడి ఇదేనని నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ ద్వారా తెలుస్తోంది. 2010, 2011, 2013 ఆర్థిక సంవత్సరాల్లో మాత్రమే ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 20 బిలియన్‌ డాలర్లను అధిగమించాయి. మరోవైపు దేశీయ సంస్థాగత మదుపర్లు 2020-21 ఆఖరుకు 203 బిలియన్‌డాలర్లకు చేరాయి. ఎక్స్చేంజీ ట్రేడెడ్‌ ఫండ్స్‌లో 38 బి.డాలర్లు, లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ల్లో 24 బి.డాలర్లు, ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ల్లో 22 బి.డాలర్లు, మిడ్‌-క్యాప్‌ ఫండ్‌ల్లో 16 బి.డాలర్లు చొప్పున దేశీయ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. 

*ఎన్‌ఎస్‌ఈ 500 షేర్లలో అత్యధిక వాటా వ్యవస్థాపకులది (46 శాతం) కాగా.. ఎఫ్‌ఐఐలు 20%, చిన్న మదుపర్లు 9%, దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు 7%, ప్రభుత్వం 5.5%, బ్యాంకులు/ ఇతర ఆర్థిక సంస్థలు/ బీమా సంస్థలు 5% చొప్పున వాటా కలిగి ఉన్నాయి. 2020 డిసెంబరు నుంచి వాటా తీరుతెన్నుల్లో మార్పు వచ్చింది. వ్యవస్థాపకుల వాటా 120 బేసిస్‌ పాయింట్లు, చిన్న మదుపర్ల వాటా 20 బేసిస్‌ పాయింట్లు మేర పెరగ్గా.. ఎఫ్‌ఐఐల వాటా 150 బేసిస్‌ పాయింట్లు తగ్గింది.  

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని