రిలయన్స్‌ చేతికి బ్రిటన్‌ కంపెనీ స్టోక్‌ పార్క్‌
close

Published : 24/04/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిలయన్స్‌ చేతికి బ్రిటన్‌ కంపెనీ స్టోక్‌ పార్క్‌

జేమ్స్‌బాండ్‌ చిత్రాలతో చిరపరిచితం
రూ.592 కోట్లకు ఒప్పందం

దిల్లీ: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ కంట్రీ క్లబ్‌, లగ్జరీ గోల్ఫ్‌ రిసార్ట్‌ అయిన స్టోక్‌ పార్క్‌ను ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) కొనుగోలు చేసింది. పలు జేమ్స్‌ బాండ్‌ చిత్రాలతో చిరపరిచితమైన ఈ పార్క్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌ (ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌) ద్వారా 57 మిలియన్‌ పౌండ్ల(దాదాపు రూ.592 కోట్లు)తో ఆర్‌ఐఎల్‌ సొంతం చేసుకుంది. స్టోక్‌ పార్క్‌కు బ్రిటన్‌లోని బకింగ్‌హామ్‌షైర్‌లో ఒక హోటల్‌, గోల్ఫ్‌ కోర్స్‌; స్టోక్‌ పోజెస్‌లో పలు స్పోర్టింగ్‌, లీజర్‌ సదుపాయాలున్నాయి. ఐరోపాలో అత్యధిక రేటింగ్‌ ఉన్న గోల్ఫ్‌ కోర్సుల్లో ఒకటి ఈ కంపెనీ సొంతం. ఇవన్నీ రిలయన్స్‌కు చెందిన వినియోగ, ఆతిథ్య ఆస్తుల్లోకి చేరతాయని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో ఆర్‌ఐఎల్‌ తెలిపింది.
‘గోల్డ్‌ఫింగర్‌’ సినిమాతో ప్రాచుర్యం: స్టోక్‌పార్క్‌ బ్రిటిష్‌ సినిమా పరిశ్రమతో సన్నిహిత సంబంధాలనే కలిగి ఉంది. రెండు జేమ్స్‌ బాండ్‌ చిత్రాలు(గోల్డ్‌ఫింగర్‌-1964; టుమారో నెవర్‌ డైస్‌-1997) ఇందులోనే చిత్రీకరించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని