హైదరాబాద్‌ కేంద్రాన్ని విస్తరించనున్న మాస్‌మ్యూచువల్‌
close

Published : 29/04/2021 02:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌ కేంద్రాన్ని విస్తరించనున్న మాస్‌మ్యూచువల్‌

ఏడాది చివరి నాటికి 1,000 మంది ఉద్యోగులు

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాకు చెందిన మాస్‌మ్యూచువల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ని విస్తరించబోతోంది. ప్రస్తుతం ఈ కేంద్రంలో 550 మంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 1,000కి చేరుతుందని మాస్‌ మ్యూచువల్‌ జీసీసీ ఇండియా హెడ్‌ రవి తంగిరాల తెలిపారు. ఈ కేంద్రంపై ఐదేళ్లలో రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తామని గతంలోనే ప్రకటించినట్లు తెలిపారు. ప్రారంభంలో 75వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పుడు దాన్ని 1,50,000 చదరపు అడగులకు విస్తరించినట్లు పేర్కొన్నారు. టెక్నాలజీ అభివృద్ధి, క్వాలిటీ అస్యూరెన్స్‌, క్లౌడ్‌ ఇంజినీరింగ్‌, డేటా సైన్స్‌ తదితర విభాగాల్లో నియామకాలు ఉంటాయన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని