కరోనా బాధితులకు రిలయన్స్‌ ఊపిరి
close

Updated : 02/05/2021 07:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా బాధితులకు రిలయన్స్‌ ఊపిరి

 జామ్‌ నగర్‌లో రోజుకు 1000 టన్నుల ఆక్సిజన్‌
 దేశ ఉత్పత్తిలో 11 శాతం ఇక్కడి నుంచే

దిల్లీ: దేశంలో ఎక్కడ చూసినా ఆక్సిజన్‌ అందక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తొలి దశతో పోలిస్తే మలి దశలో ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో దేశానికి ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నడుం బిగించింది.
‘ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు’
నాకు, నాతో పాటు రిలయన్స్‌లో పనిచే స్తున్న ప్రతి ఒక్కరికీ.. దేశంలోని ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడడం తప్ప మరేదీ ముఖ్యం కాదు. ఈ కరోనా మలి దశలో దేశంతో పాటు మేమూ యుద్ధంలో పాల్గొంటాం. వైద్య ఆక్సిజన్‌ విషయంలో భారత ఉత్పత్తి, రవాణాను భారీగా పెంచడం తక్షణ అవసరమ’ని ఈ సందర్భంగా ముకేశ్‌ అంబానీ అన్నారు.
జామ్‌నగర్‌లో తయారీ
ముకేశ్‌కు చెందిన రిలయన్స్‌ తన వైద్య ఆక్సిజన్‌ ఉత్పత్తిని సున్నా నుంచి రోజుకు 1000 టన్నులకు పెంచింది. తద్వారా ఒకే ప్రాంతం వద్ద ద్రవ ఆక్సిజన్‌ భారీ ఎత్తున తయారు చేస్తున్న అతిపెద్ద తయారీ కంపెనీగా అవతరించింది. దీంతో దేశంలో తయారవుతున్న మొత్తం వైద్య సంబంధిత ద్రవీకృత ఆక్సిజన్‌లో రిలయన్స్‌ 11 శాతానికి పైగా ఉత్పత్తి చేసినట్లవుతోందని ఒక ప్రకటన పేర్కొంది.
కంటైనర్ల దిగుమతి
గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి ఈ ఉత్పత్తి పెంపు, రవాణాపై అంబానీయే వ్యక్తిగతంగా దృష్టి పెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఏప్రిల్‌లో కంపెనీ 15,000 టన్నుల ఆక్సిజన్‌ను ఉచితంగా సరఫరా చేసింది. సౌదీ అరేబియా, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్‌, థాయ్‌లాండ్‌ల నుంచి ఆక్సిజన్‌ను రవాణా చేసే 24 ఐఎస్‌ఓ కంటైనర్లను విమానాల ద్వారా తెప్పించింది. తద్వారా భారత్‌కు 500 టన్నుల అదనపు రవాణా సామర్థ్యం పెరిగింది.
తయారీ లేకున్నా..
రిలయన్స్‌ ఎపుడూ ఆక్సిజన్‌ తయారీలో లేదు. అయితే కరోనా సమయంలో సున్నా సామర్థ్యంతో మొదలుపెట్టి ఇపుడు దేశంలోనే అతిపెద్ద తయారీదారుగా అవతరించింది. రోజుకు 1000 టన్నుల వైద్య ఆక్సిజన్‌ను సిద్ధంగా చేస్తూ ప్రతీ పది రోగుల్లో ఒకరి అవసరాలకు సరిపడే (మొత్తం దేశ ఉత్పత్తిలో 11%) ఆక్సిజన్‌ను అందిస్తోందని రిలయన్స్‌ తెలిపింది. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రవాణా కూడా చేస్తున్నట్లు తెలిపింది. తమ నైట్రోజన్‌ ట్రక్కులను ఆక్సిజన్‌ ట్యాంకర్లుగా మార్చినట్లూ తెలిపింది.Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని