close

Published : 05/05/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సువెన్‌ లైఫ్‌సైన్సెస్‌కు రూ.21.69 కోట్ల నష్టం

ఈనాడు, హైదరాబాద్‌: ఔషధ పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.2.88 కోట్ల ఆదాయాన్ని, రూ.21.69 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2019-20 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.11.65 కోట్లు, నికర నష్టం రూ.25.74 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి సువెన్‌ లైఫ్‌సైన్సెస్‌ రూ.21.23 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. దీనిపై రూ.72.45 కోట్ల నికర నష్టం ఉంది. ఇందులో సువెన్‌ లైఫ్‌సైన్సెస్‌తో పాటు దాని అనుబంధ సంస్థ అయిన సువెన్‌ న్యూరోసైన్సెస్‌ ఇంక్‌., ఆర్థిక ఫలితాలూ కలిసి ఉన్నాయి. పగటి పూట అధిక నిద్ర (నార్కోలెప్సీ) ని అదుపు చేసే ఔషధమైన సమిలిశాంట్‌ (ఎస్‌యూవీఎన్‌-జీ3031) పై రెండో దశ క్లినికల్‌ పరీక్షల ఫలితాలను అమెరికాలో డీఎస్‌ఎంబీ (డేటా సేఫ్టీ మోనిటరింగ్‌ బోర్డు) కి అందించినట్లు సువెన్‌ లైఫ్‌ పేర్కొంది. అదనంగా మరికొంత మంది రోగులపై ఈ ఔషధానికి సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షలు వచ్చే ఏడాది చివరికి పూర్తవుతాయని వివరించింది. మసుపిర్డైన్‌ (ఎస్‌యూవీఎన్‌- 502) ఔషధంపై మరోసారి రెండో దశ క్లినికల్‌ పరీక్షలు చేపట్టనున్నట్లు, ఈ ఏడాది ఆగస్టులో ఇవి మొదలవుతాయని వెల్లడించింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని