close

Published : 05/05/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌-19కు సమాధానం కొవాగ్జిన్‌

 టీకా తయారీ యజ్ఞానికి ఏడాది
 ప్రైవేటు-ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్య విజయమిది

మిటీ వ్యాధి, దీన్ని ఎదుర్కోవడం ఎలా? అని ప్రపంచం అంతా తీవ్రమైన ఆందోళనతో, దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో.. ప్రైవేటు - ప్రభుత్వ భాగస్వామ్యంతో మనదేశ శాస్త్రవేత్తలు, కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనే టీకాను ఆవిష్కరించాలనే భగీరథ యత్నానికి శ్రీకారం చుట్టారు. ఈ కసరత్తుకు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ముందు నిలవగా, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వెన్నుదన్నుగా నిలిచి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ కుంగిపోక, అనుకున్నది సాధించారు. ఒక్క ఏడాది కాలంలోనే కొవిడ్‌-19 వ్యాధిని అదుపు చేసే ‘కొవాగ్జిన్‌’ టీకాను  ఆవిష్కరించి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ఘనత చాటిచెప్పారు. టీకా ఆవిష్కరణ ప్రయత్నానికి గత ఏడాది ఏప్రిల్‌లో తొలి అడుగు పడింది. అక్కడి నుంచి ప్రతి నెలా ఎంతో కొంత ప్రగతి నమోదు చేస్తూ అనుకున్నది సాధించారు.

ఈ కసరత్తు ఎలా ముందుకు సాగిందంటే..

2020

ఏప్రిల్‌ - ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐఏ) నుంచి  సార్స్‌- కోవ్‌- 2 వైరస్‌ స్ట్రెయిన్‌ కోసం భారత్‌ బయోటెక్‌ అభ్యర్థన


* మే - పుణె నుంచి హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ప్రాంగణానికి  సార్స్‌- కోవ్‌- 2 వైరస్‌ స్ట్రెయిన్‌ చేరిక


* జూన్‌ - టీకాపై ప్రీ-క్లినికల్‌, టాక్సికాలజీ అధ్యయనాలు మొదలు


* జులై - ‘కొవాగ్జిన్‌’ టీకాపై మొదటి, రెండో దశ క్లినికల్‌ పరీక్షలకు డీసీజీఐ/ సీడీఎస్‌సీఓ అనుమతి


* సెప్టెంబరు - రెండో దశ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభం


* నవంబరు - ‘కొవాగ్జిన్‌’ పై మూడో దశ క్లినికల్‌   పరీక్షలు భారీస్థాయిలో మొదలు


2021

జనవరి 3 - కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసిన డీసీజీఐ


* జనవరి 13 - దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రారంభం


* జనవరి 16 - కొవిడ్‌ పోరాట యోధులకు టీకా


* మార్చి 27 - అంతర్జాతీయ శాస్త్ర సాంకేతిక పత్రికల్లో కొవాగ్జిన్‌పై పరిశోధనా పత్రాల ప్రచురణ


* ఏప్రిల్‌ - జాతీయ టీకాల కార్యక్రమానికి 2 కోట్ల డోసుల టీకా పంపిణీ. వార్షిక ఉత్పత్తి  సామర్థ్యం 50 కోట్ల డోసులకు పెంపు

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని