మార్కెట్లకు ఆర్‌బీఐ అండ
close

Published : 06/05/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లకు ఆర్‌బీఐ అండ

సమీక్ష
వరుస నష్టాలకు అడ్డుకట్ట
 రాణించిన ఫైనాన్స్‌ షేర్లు

మార్కెట్లలో మూడు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పలు ఉద్దీపన చర్యలు ప్రకటించడం మార్కెట్లను మెప్పించింది. బ్యాంకింగ్‌, ఔషధ, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే రూపాయి డీలాపడటంతో లాభాలు పరిమితమయ్యాయి. 6 పైసలు తగ్గిన రూపాయి 73.91 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ నష్టపోగా, సియోల్‌, షాంఘై, టోక్యో పనిచేయలేదు. ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్‌ ఉదయం 48,569.12 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అనంతరం ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 48,742.72 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌.. చివరకు 424.04 పాయింట్ల లాభంతో 48,677.55 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 121.35 పాయింట్లు పెరిగి 14,617.85 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 14,506.60- 14,637.90 పాయింట్ల మధ్య కదలాడింది.

* కోటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సిటీ యూనియన్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్‌ బ్యాంక్‌ 2.42 శాతం వరకు లాభాలు నమోదు చేశాయి.
సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 లాభపడ్డాయి. సన్‌ఫార్మా అత్యధికంగా 5.94 శాతం రాణించింది. డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌ 2.41 శాతం వరకు పెరిగాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ యునిలీవర్‌ మాత్రం నీరసపడ్డాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని