ఐఓసీ వైద్య బీమా పునరుద్ధరణ
close

Published : 07/05/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐఓసీ వైద్య బీమా పునరుద్ధరణ

దిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తమ పెట్రోల్‌ పంపుల్లో పని చేసే సహాయకులకు, వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) డెలివరీ బాయ్స్‌కి వైద్య బీమా పునరుద్ధరించింది. ఇండియన్‌ ఆయిల్‌ కర్మ యోగి స్వస్థ్య బీమా యోజన పేరిట 2021 మే 1 నుంచి ఈ బీమా అమలవుతోందని ఐఓసీ తెలిపింది. ఒకవేళ ప్రమాదవశాత్తు ఏ ఉద్యోగి అయినా మరణిస్తే, వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం (ఎక్స్‌గ్రేషియా) చెల్లింపు కొనసాగిస్తామని తెలిపింది. వైద్య బీమా దేశంలోని రిటైల్‌ విక్రయ కేంద్రాల్లో పని చేస్తున్న 3.3 లక్షలకు పైగా సహాయకులు, ఎల్‌పీజీ డెలివరీ బాయ్స్‌, ట్యాంక్‌ ట్రంక్‌ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులకు వర్తిస్తుందని ఐఓసీ వివరించింది. కొవిడ్‌ సంబంధిత జబ్బులకు వారితో సహా జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలకు రూ.1 లక్ష వరకు ఆసుపత్రి ఖర్చులు పొందే అవకాశం ఉంటుందని తెలిపింది. ప్రమాదవశాత్తు మరణిస్తే బీమాదారుడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం లభిస్తుందని పేర్కొంది. కొవిడ్‌ మహమ్మారితో మరణిస్తే రూ.5 లక్షల బీమా కవరేజీ లభిస్తుందని వెల్లడించింది. 2020-21లో 23 కుటుంబాలకు నష్టపరిహారం అందించామని ఐఓసీ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని