హోండా కార్స్‌ ఉత్పత్తి 12 రోజుల పాటు నిలిపివేత
close

Published : 07/05/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హోండా కార్స్‌ ఉత్పత్తి 12 రోజుల పాటు నిలిపివేత

దిల్లీ: కొవిడ్‌ రెండో దశ విజృంభణ నేపథ్యంలో హోండా కార్స్‌ ఇండియా రాజస్థాన్‌లోని టపుకారా తయారీ ప్లాంట్‌ను ఈనెల7 నుంచి 12 రోజుల పాటు మూసివేయనున్నట్లు ప్రకటించింది. మామూలుగా ప్లాంట్‌ నిర్వహణకు కంపెనీలు 10 రోజులు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేస్తుంటాయి. ఈసారి కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ముందుగానే ఉత్పత్తి నిలిపివేసి, నిర్వహణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. హోండా టపుకారా ప్లాంట్‌కు ఏడాదికి 1.8 లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కార్పొరేట్‌, జోనల్‌ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసి వినియోగదార్లు, వ్యాపార భాగస్వాములకు మద్దతు ఇస్తారని హోండా కార్స్‌ తెలిపింది. ఈ నెల 19 నుంచి యథావిధిగా ఉత్పత్తి కార్యకలాపాలు మళ్లీ ప్రారంభిస్తామని పేర్కొంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని