‘ స్వేచ్ఛా వాణిజ్యం’ దిశగా భారత్‌-బ్రిటన్‌
close

Published : 07/05/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ స్వేచ్ఛా వాణిజ్యం’ దిశగా భారత్‌-బ్రిటన్‌

‘2030 కార్యాచరణ’ అమలుపై  విదేశీ వ్యవహారాల మంత్రుల చర్చలు

లండన్‌: భారత్‌-బ్రిటన్‌ విస్తృత వాణిజ్య భాగస్వామ్యాని(ఈటీపీ)కి సంబంధించిన ‘2030-కార్యాచరణ’ అమలు విషయంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్‌, బ్రిటన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి డొమినిక్‌ రాబ్‌తో గురువారం చర్చలు జరిపారు. అంతిమంగా ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) దిశగా ఈ ఈటీపీ వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇద్దరు మంత్రులు దృశ్యమాధ్యమ విధానంలో సమావేశమయ్యారు. ‘ఇండో-పసిఫిక్‌ సహకారం, అంతర్జాతీయ ఆరోగ్య సవాళ్లపై చర్చలు జరిపినట్లు జైశంకర్‌ తెలిపారు. 2030 కార్యాచరణ ప్రణాళికను అమలుపై  దృష్టి సారించాం. చాలా విషయాల్లో ముందుగానే ప్రగతి కనిపిస్తుందన్న విశ్వాసం మాకుందని ట్వీట్‌ చేశారు. మంగళవారం బ్రిటన్‌ ప్రధానితో వర్చువల్‌ విధానంలో భారత ప్రధాని మోదీ సమావేశమైన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని