సునామీలా కొవిడ్‌ రెండో దశ
close

Published : 07/05/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సునామీలా కొవిడ్‌ రెండో దశ

కిరణ్‌ మజుందార్‌ షా

వాషింగ్టన్‌: భారత్‌ను కొవిడ్‌-19 రెండో దశ సునామీలా చుట్టుముట్టిందని బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా అన్నారు. ఇటీవల ముగిసిన రాష్ట్రాల ఎన్నికలు, పండుగలు కరోనా కేసుల విజృంభణకు కారణమయ్యాయని, దేశంలో ఏ ప్రాంతాన్నీ ఈ మహమ్మారి విడిచిపెట్టకపోవడం దురదృష్టకరమని తెలిపారు. అంతర్జాతీయ వ్యాక్సిన్‌ సమానత్వంపై వన్‌ షేర్‌ వరల్డ్‌ నిర్వహించిన దృశ్యమాధ్యమ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘ఈసారి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ భారతంపై కూడా కొవిడ్‌-19 ప్రభావం పడింది. కేసుల ఉద్ధృతితో ఆసుపత్రులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఇందుకు సరిపడా పడకలు, ఆక్సిజన్‌, నైపుణ్యం కలిగిన మానవ వనరులు లేవు.  ఈ మహమ్మారిని ఎదుర్కొవడానికి మన వద్ద ఉన్న ఔషధ సరఫరాలు కూడా సరిపోవు. వ్యాక్సిన్‌ల కొరతా సవాల్‌గా మారింద’ని మజుందార్‌ షా పేర్కొన్నారు. కొవిడ్‌-19ను భారత్‌ ఎదుర్కొవడానికి వీలుగా పలు దేశాలు సాయం చేయడానికి ముందుకురావడాన్ని షా స్వాగతించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని