కార్పొరేట్లు.. కొవిడ్‌ సాయం
close

Published : 07/05/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్పొరేట్లు.. కొవిడ్‌ సాయం

చైనా నాన్‌జింగ్‌ నుంచి దిల్లీకి 1,100 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను, కొవిడ్‌-19 సంబంధిత వైద్య పరికరాలను వాయు మార్గంలో తరలించినట్లు స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది.
యునైటెడ్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ద్వారా 1 మిలియన్‌ డాలర్ల (రూ.7.4 కోట్లు) కొవిడ్‌ సాయాన్ని అందించనున్నట్లు యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌ వెల్లడించింది.
ది టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎస్‌సీ) తమ వెబ్‌సైట్‌లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ ట్రైనింగ్‌ మాడ్యుల్‌ని ప్రారంభించింది. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అమర్చి, నిర్వహించడంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించినట్లు తెలిపింది.
కొవిడ్‌-19 టీకా లభ్యత (వ్యాక్సినేషన్‌ స్లాట్స్‌) గురించి ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా పేటీఎం తమ ప్లాట్‌ఫామ్‌పై ‘కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఫైండర్‌’ను ప్రారంభించింది.
ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లు వంటి అత్యవసర వైద్య పరికరాలను దిల్లీకి చేర్చేందుకు బోయింగ్‌ 777-200 ఎయిర్‌క్రాఫ్ట్‌ నిర్వహించినట్లు బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ వెల్లడించింది.
రోజువారీ ఆక్సిజన్‌ సరఫరా పరిమితిని 120 టన్నులకు పెంచినట్లు జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ (జేఎస్‌పీఎల్‌) వెల్లడించింది. ఇప్పటి వరకు రోజుకు సుమారు 100 టన్నుల వరకు జేఎస్‌పీఎల్‌ సరఫరా చేసింది.
దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ఆసుపత్రుల్లో అదనంగా 500కు పైగా పడకలు ఏర్పాటు చేసేందుకు  సహకారం అందిస్తామని హెచ్‌సీఎల్‌ గ్రూప్‌ తెలిపింది.  
ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, రెస్పిరేటర్లు వంటి రూ.24 కోట్లకు పైగా విలువైన వైద్య పరికరాలను భారత్‌కు పంపించినట్లు స్విట్జర్లాండ్‌ వెల్లడించింది. 13 టన్నుల వైద్య పరికరాలతో విమానం దిల్లీకి బయలుదేరిందని తెలిపింది.
ఆటోమొబైల్‌ పోర్టల్‌ కార్‌దేఖో ఉద్యోగుల టీకా ఖర్చు భరించడతో సహా ఫీల్డ్‌ సిబ్బందికి నెలవారీగా కొవిడ్‌ అలవెన్స్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది.
అంతర్గత కమ్యూనిటీ నెట్‌వర్క్‌తో సహా టాస్క్‌ఫోర్స్‌, 24/7 హాట్‌లైన్‌ ఏర్పాటు చేసి మందులు, పడకలు, ఆక్సిజన్‌, ప్లాస్మా, పరికరాలు, ఇతర చికిత్సల గురించిన సమాచారాన్ని అందించనున్నట్లు పబ్లిసిస్‌ సేపియెంట్‌ వెల్లడించింది.
ఆక్సిజన్‌ఫర్‌ఇండియా.ఓఆర్‌జీ ద్వారా 1.2 మిలియన్‌ డాలర్లను (సుమారు రూ.9 కోట్లు) సమీకరించి 3,500 ఆక్సిజన్‌ సిలిండర్లను, 700 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందించాలనుకుంటున్నట్లు డయాగ్నోస్టిక్స్‌ సేవల సంస్థ హెల్త్‌క్యూబ్‌ తెలిపింది.
డిజిటల్‌ పేమెంట్స్‌ అండ్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ కంపెనీ క్యాష్‌ఫ్రీ, డెమోక్రసీ ప్యూపుల్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ‘మిషన్‌ ఆక్సిజన్‌’ ప్రచారంలో భాగంగా వచ్చే ప్రతి రూపాయికి తాము రూ.1 కలిపి రూ.40 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలనుకుంటున్నట్లు ప్రకటించింది.
ఐటీ, బిజినెస్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ విజనెట్‌ సిస్టమ్స్‌ తమ 4,000 మంది సిబ్బందికి టీకాల వ్యయాన్ని భరిస్తామని తెలిపింది.
చెఫ్‌ సరాన్ష్‌ గోయిలా ఆధ్వర్యంలో నడుస్తున్న కొవిడ్‌మీల్స్‌ఫర్‌ఇండియా.కామ్‌ ద్వారా కొవిడ్‌ బాధిత కుటుంబాలకు ఆహారం పంపిణీ చేసేందుకు దిల్లీకి చెందిన అంకుర సంస్థ ఫాస్టోర్‌ చేతులు కలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని