భారత్‌లో కరోనా కట్టడికి దేశాల సహకారమే కీలకం
close

Published : 07/05/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో కరోనా కట్టడికి దేశాల సహకారమే కీలకం

ఐఎమ్‌ఎఫ్‌

వాషింగ్టన్‌: భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడికి పలు దేశాల సహకారం కీలకమని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్‌) అభిప్రాయపడింది. ఇటీవల భారత్‌కు తక్షణం సహాయం చేయడానికి పలు దేశాలు చేసిన ప్రకటనలను ఐఎమ్‌ఎఫ్‌ ఈ సందర్భంగా ప్రశంసించింది.అంతర్జాతీయ సహకారం వేగవంతమయ్యేలా ఐఎమ్‌ఎఫ్‌ కృషి చేస్తుందని  సంస్థ కమ్యూనికేషన్స్‌ విభాగం డైరెక్టర్‌ గెర్రీ రైస్‌ పేర్కొన్నారు.  2021, 2022ల్లో భారత వృద్ధి 12.5 శాతం దరిదాపుల్లో నమోదవవచ్చని ఏప్రిల్‌ అంచనాల్లో ఐఎమ్‌ఎఫ్‌ పేర్కొంది. అయితే తాజా పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్నామని.. జులైలో వృద్ధి అంచనాలను పునః సమీక్షిస్తామని రైస్‌ వివరించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని