సాగర్‌సాఫ్ట్‌ ఇండియా చేతికి యూఎస్‌ కంపెనీలో వాటా
close

Published : 07/05/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాగర్‌సాఫ్ట్‌ ఇండియా చేతికి యూఎస్‌ కంపెనీలో వాటా

ఈ నెల 14న బోర్డు సమావేశంలో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాగర్‌సాఫ్ట్‌ ఇండియా లిమిటెడ్‌ వ్యాపార కార్యకలాపాల విస్తరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ఒక ఐటీ కంపెనీలో మెజార్టీ వాటా కొనుగోలు చేయబోతోందని తెలుస్తోంది. సాగర్‌సాఫ్ట్‌ ఇండియా ప్రస్తుతం అమెరికాకు చెందిన డేటా ఐకు, వర్క్‌డే, ఎలాస్టిక్‌, వీవ, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలకు ఆఫ్‌షోర్‌/ ఆన్‌సైట్‌ సేవలు అందిస్తోంది. ఖాతాదారుల సంఖ్య ఇంకా పెంచుకోడానికి, వ్యాపార కార్యకలాపాలను బహుముఖంగా విస్తరించటానికి వీలుగా అమెరికాకు చెందిన ఏదైనా ఐటీ కంపెనీని కొనుగోలు చేయాలని కొంతకాలంగా భావిస్తున్న సాగర్‌సాఫ్ట్‌ యాజమాన్యం తాజాగా  ఒక కంపెనీని గుర్తించినట్లు సమాచారం. ఈ నెల 14న జరిగే సాగర్‌సాఫ్ట్‌ ఇండియా డైరెక్టర్ల బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయాన్ని కంపెనీ గురువారం బీఎస్‌ఈ (బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ) కి వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి, నాలుగో త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలను కూడా అదే సమావేశంలో పరిగణనలోకి తీసుకుంటారు. వాటాదార్లకు డివిడెండ్‌ చెల్లించాలనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని