హీరో మోటోకార్ప్‌ లాభం రూ.885 కోట్లు
close

Published : 07/05/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హీరో మోటోకార్ప్‌ లాభం రూ.885 కోట్లు


దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.885.28 కోట్ల నికర లాభాన్ని హీరో మోటోకార్ప్‌ ఆర్జించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో కంపెనీ నమోదు చేసిన నికర లాభం రూ.613.81 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం ఎక్కువ. కార్యకలాపాల మొత్తం ఆదాయం రూ.6,333.89 కోట్ల నుంచి రూ.8,689.74 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం 15.68 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. 2019-20 మార్చి త్రైమాసికంలో విక్రయించిన 13.23 లక్షల వాహనాలతో పోలిస్తే ఇది 18.5 శాతం ఎక్కువ. 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.2,936.05 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 209-20లో నమోదు చేసిన రూ.3,659.41 కోట్లతో పోలిస్తే ఇది 20 శాతం తక్కువ. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.29,255.32 కోట్ల నుంచి రూ.30,959.19 కోట్లకు చేరింది.
2021 అక్టోబరు 1 నుంచి 5 ఏళ్ల పాటు ఛైర్మన్‌, సీఈఓగా పవన్‌ ముంజాల్‌ను కంపెనీ పునర్నియామకం చేసినట్లు తెలిపింది. వాటాదార్ల తుది అనుమతికి లోబడి ఇది ఉంటుంది.
హీరో మోటోకార్ప్‌ గత నెల 22 నుంచి మే 1 వరకు ప్లాంట్‌ కార్యకలాపాలు నిలిపివేసింది. ఇప్పుడు ఈ నెల 9 వరకు దాన్ని పొడిగించింది. 10 నుంచి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

రేమండ్‌ లాభం రూ.58 కోట్లు

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రేమండ్‌ రూ.58.36 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో సంస్థ నమోదు చేసిన నికర లాభం రూ.69.10 కోట్లతో పోలిస్తే ఇది 15.5 శాతం తక్కువ. మొత్తం ఆదాయం రూ.1,290.87 కోట్ల నుంచి 9.03 శాతం పెరిగి రూ.1,407.45 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.1,442.80 కోట్ల నుంచి 6.96 శాతం తగ్గి రూ.1,342.31 కోట్లకు పరిమితమయ్యాయి. 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.303.65 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. 2019-20లో రూ.201.76 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.6,578.30 కోట్ల నుంచి 44.5 శాతం తగ్గి రూ.3,467.83 కోట్లకు పరిమితమైంది.

కాగ్నిజంట్‌ లాభంలో 37.6% వృద్ధి

దిల్లీ: మార్చి త్రైమాసికంలో ఐటీ సంస్థ కాగ్నిజంట్‌ నికర లాభం 37.6 శాతం పెరిగి 505 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ 367 మిలియన్‌ డాలర్ల లాభాన్ని నమోదుచేసింది. కాగ్నిజంట్‌ జనవరి- డిసెంబరును ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. మార్చి త్రైమాసికంలో సంస్థ ఆదాయం 4.2 శాతం పెరిగి 4.4 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ‘మొదటి త్రైమాసికంలో డిజిటల్‌, అంతర్జాతీయ విస్తరణపై పెట్టుబడులు, కాగ్నిజంట్‌ బ్రాండ్‌ బలోపేతం వ్యూహాలను మెరుగ్గా అమలు చేశాం. క్లౌడ్‌ మైగ్రేషన్‌, డిజిటల్‌కు మారడం వంటివి రాబోయే సంవత్సరాల్లో మంచి అవకాశాలు కల్పించనున్నాయి’ అని కాగ్నిజంట్‌ సీఈఓ బ్రయన్‌ హంఫైర్స్‌ తెలిపారు. భారత్‌లో కొవిడ్‌ సంక్షోభం చాలా బాధాకరమని, మిలియన్‌ డాలర్ల సాయం చేయనున్నట్లు ప్రకటించారు. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 10.5- 11.5 శాతం పెరిగి 4.42- 4.46 బిలియన్‌ డాలర్లు నమోదు కావొచ్చని కాగ్నిజంట్‌ అంచనా వేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 7-9 శాతం వృద్ధి చెంది 17.8- 18.1 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని భావిస్తోంది. భారత్‌లో సంస్థకు దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని