ఒడిశాలో ‘కొవాగ్జిన్‌’ టీకా తయారీకి భారత్‌ బయోటెక్‌ సన్నాహాలు
close

Published : 08/05/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒడిశాలో ‘కొవాగ్జిన్‌’ టీకా తయారీకి భారత్‌ బయోటెక్‌ సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: ‘కొవాగ్జిన్‌’ టీకాను భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఒడిశా రాష్ట్రంలోనూ ఉత్పత్తి చేయనుంది. ఇందుకు వీలుగా భువనేశ్వర్‌ సమీపంలోని అంథరువాలో ఒక యూనిట్‌ను రూ.300 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ యూనిట్లో వచ్చే ఏడాది జూన్‌ నాటికి ‘కొవాగ్జిన్‌’ టీకా ఉత్పత్తి మొదలయ్యే అవకాశం ఉంది. ఒడిశా ప్రభుత్వం దీనికి అవసరమైన అనుమతులు జారీ చేసింది. ఈ యూనిట్లో ‘కొవాగ్జిన్‌’ తో పాటు రొటావైరస్‌, మలేరియా, జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌, రేబిస్‌, ఇన్‌ఫ్లుయంజా... తదితర పది రకాల వ్యాధులకు అనువైన టీకాలను ఉత్పత్తి చేయవచ్చని తెలిసింది. కానీ ప్రస్తుత అవసరాల దృష్ట్యా ‘కొవాగ్జిన్‌’ టీకాకు అధిక ప్రాధాన్యం ఇస్తారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని