డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌లో రెమ్‌డెసివిర్‌ తయారీ
close

Published : 08/05/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌లో రెమ్‌డెసివిర్‌ తయారీ

విశాఖపట్నం (కూర్మన్నపాలెం), న్యూస్‌టుడే : కరోనా రెండో దశ విజృంభిస్తున్న వేళ రోగులకు అవసరమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల తయారీకి అనుమతులు మంజూరు చేసినట్లు వీసెజ్‌ జోన్‌ డెవలెప్‌మెంట్‌ కమిషనర్‌ ఎ.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రతి నెలా జరిగే యూనిట్ల అనుమతుల కమిటీ(యూఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దువ్వాడ వీసెజ్‌ పరిధిలోని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఈ ఇంజక్షన్ల తయారీకి ముందుకు రావడంతో ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతులు ఇచ్చామన్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ స్థానిక యూనిట్‌ అధిపతి మీనన్‌ మాట్లాడుతూ... జూన్‌లో తమ ఉత్పత్తులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పరిశ్రమ నుంచి 3.5 లక్షల 100ఎంజీ/1ఎంఎల్‌, 7 లక్షల 500ఎంజీ/5ఎంఎల్‌ ఇంజెక్షన్లు తయారు చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
*విశాఖ జిల్లా నక్కపల్లిలోని హానర్‌ ల్యాబ్స్‌ పరిశ్రమ ద్వారా ఏడాదికి 100 కేజీల  మోల్నుపిరవిర్‌ తయారీకి అనుమతి ఇచ్చామని వివరించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని