టీకా ఉత్పత్తి పెంచాలంటే..
close

Published : 09/05/2021 05:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా ఉత్పత్తి పెంచాలంటే..

సాంకేతికత బదిలీ, ముడి పదార్థాల సరఫరా పెరగాలి
కంపెనీల భాగస్వామ్యాలూ ఉండాలి
అపుడే దేశానికి, ప్రపంచానికి సరిపడా అందించగలం
భారత్‌ బయోటెక్‌ సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్ల

దిల్లీ: ఇతర కంపెనీలతో భాగస్వామ్యాలు, సాంకేతికత బదిలీలు, వివిధ కీలక సామగ్రి, పదార్థాల సరఫరాలు పెరిగినపుడే గిరాకీకి తగ్గట్లుగా టీకా ఉత్పత్తిని పెంచడం సాధ్యమవుతుందని భారత్‌ బయోటెక్‌ సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్ల పేర్కొన్నారు. శనివారం జరిగిన ఈయూ-ఇండియా బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే..

అక్కడ కొవాగ్జిన్‌ నమోదుకు సిద్ధం
మేం మా టీకా(కొవాగ్జిన్‌)ను అమెరికాలో రిజిస్టర్‌ చేస్తున్నాం. ఐరోపాలో చేయడానికీ సిద్ధంగా ఉన్నాం. ఈయూలోని కంపెనీలు, అకడమిక్‌ సంస్థలు మాతో జట్టుకడితే అంత కంటే సంతోషం లేదు. భారత్‌లోని 130 కోట్ల జనాభాకు సరిపడా 260 కోట్ల డోసులను తక్కువ సమయంలో అందించలేం. 200 కోట్ల డోసులు కూడా వేగంగా ఇవ్వడం ఏ దేశానికీ సాధ్యం కాని పని. అయితే ఇపుడు ఆ అవసరం ఉంది. మా ప్లాంట్లలో కొత్త సాంకేతికతలను వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకు సాంకేతికత బదిలీ అవసరం అవుతుంది. అపుడు తక్కువ సమయంలో భారత్‌కే కాదు.. ప్రపంచానికీ టీకా అందించడానికి సాధ్యమవుతుంది.

ఐరోపా నుంచి మాకు కావాల్సింది ఇవీ..
ఐరోపా నుంచి సరఫరాల రాక ఆలస్యమవుతోంది. మేం ఫిర్యాదు చేయడం లేదు. కాకపోతే మేం ఆర్డరు పెట్టేవాటికి వచ్చే వాటికి పొంతన ఉండడం లేదు. దేశంలో టీకా తయారీదార్లకు భారీ మొత్తంలో ముడి పదార్థాల అవసరం ఉంది. ఇపుడు ఐరోపా దేశాల నుంచి సాంకేతికత బదిలీ, టీకా తయారీకి కావలసిన ముడి పదార్థాలు కావాలి. పేటెంట్ల సడలింపుల వల్ల కూడా టీకా తయారీదార్లకు సహాయం చేయవచ్చు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని