జూన్‌ నుంచి బ్యాడ్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు!
close

Published : 10/05/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జూన్‌ నుంచి బ్యాడ్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు!

దిల్లీ: 2021-22 బడ్జెట్‌లో ప్రకటించిన బ్యాడ్‌ బ్యాంక్‌/నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) కార్యకలాపాలు జూన్‌లో మొదలయ్యే అవకాశం ఉందని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) సీఈఓ సునీల్‌ మెహతా వెల్లడించారు. బ్యాడ్‌ బ్యాంక్‌ అనేది ఒక ఆర్థిక సంస్థగా ఏర్పాటై, రుణదాతల వద్ద పేరుకున్న మొండి బకాయిలను తీసుకుని, వాటికి ఒక పరిష్కారం చూపనుంది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల సహకారంతో ఈ బ్యాడ్‌ బ్యాంక్‌  ఏర్పాటవుతుంది. ‘మొండి బకాయిల పరిష్కారానికి చాలా మంది రుణదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకసారి బ్యాడ్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభమైతే, 100 శాతం రుణాలను దానికి అప్పగించి రుణదాతలు ఒక మంచి పరిష్కారాన్ని పొందే అవకాశం ఉంటుంద’ని సునీల్‌ వివరించారు.
* రుణదాతలు గుర్తించిన నిరర్థక ఆస్తు (ఎన్‌పీఏ)లను ఎన్‌ఏఆర్‌సీఎల్‌ స్వాధీనం చేసుకుంటుంది. ఇందులోని లీడ్‌బ్యాంక్‌ స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో ఇతర ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీల నుంచి బిడ్లు ఆహ్వానిస్తుంది. ఎన్‌పీఏకు అధిక విలువ రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది. రుణదాతలు 100 శాతం కేటాయింపులు జరిపిన ఆస్తులను ఇందుకు ఎంచుకుంటుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని