రెండో నెలా ఫండ్‌ల జోరు
close

Published : 10/05/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండో నెలా ఫండ్‌ల జోరు

దిల్లీ: స్టాక్‌ మార్కెట్‌లో మ్యూచువల్‌ ఫండ్ల కొనుగోళ్ల పరంపర వరుసగా రెండో నెలా కొనసాగింది. ఏప్రిల్‌లో షేర్లలో రూ.5,526 కోట్ల పెట్టుబడులు పెట్టడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల మార్కెట్‌లో కొంత స్థిరీకరణ తర్వాత మళ్లీ అవకాశాలను ఫండ్‌ మేనేజర్లు ఒడిసిపట్టుకుంటున్నారు. సెబీ గణాంకాల ప్రకారం.. మార్చిలో మ్యూచువల్‌ ఫండ్‌లు రూ.4,773 కోట్లు పెట్టుబడులు పెట్టగా, గత నెలలో రూ.5,526 కోట్లు చొప్పించాయి. గత 10 నెలల్లో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. అంతకు ముందు 2020 జూన్‌ నుంచి ఈక్విటీల్లో నుంచి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం మొదలుపెట్టాయి. ఈ ఏడాది మార్చిలో మళ్లీ పెట్టుబడులు రావడం ప్రారంభమైంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని