పసిడికి దిద్దుబాటు!
close

Published : 10/05/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పసిడికి దిద్దుబాటు!

కమొడిటీస్‌ ఈ వారం

బంగారం
పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం సానుకూలంగానే కన్పిస్తోంది. అయితే రూ.48,935 స్థాయి వద్ద కాంట్రాక్టుకు గట్టి నిరోధం కన్పిస్తోంది. అందువల్ల రూ.48,460 దరిదాపులో లాభాలు స్వీకరించడం మంచిది. రూ.48,952 వద్ద స్టాప్‌లాప్‌ పెట్టుకుని, షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవడమూ మంచి వ్యూహమే. రూ.46,926 కంటే కిందకు వస్తే మాత్రం రూ.46,510 వరకు కాంట్రాక్టు దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు. సాంకేతిక స్థాయులతో పాటు అమెరికా విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాలు, డాలరు కదలికలు, కొవిడ్‌-19 పరిణామాలు కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేస్తాయి.

* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ మే కాంట్రాక్టు ఈవారం రూ.14,787 కంటే దిగువన చలించకుంటే రూ.15,249; రూ.15,514 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

వెండి
వెండి జులై కాంట్రాక్టుకు ఈవారం రూ.72,887 వద్ద గట్టి నిరోధం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.74,526 వరకు వెళుతుందని భావించవచ్చు. ఒకవేళ రూ.69,961 కంటే కిందకు వస్తే   రూ.68,057 స్థాయికి పడిపోవచ్చు.

ప్రాథమిక లోహాలు
* ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ మే కాంట్రాక్టు ఈవారం రూ.15,388 కంటే దిగువన చలించకుంటే రాణించేందుకు అవకాశం ఉంటుంది. రూ.15,824 స్థాయినీ అధిగమిస్తే రూ.16,041 వరకు పెరుగుతుందని భావించవచ్చు.
* రాగి మే కాంట్రాక్టు ఈవారం రూ.798.70 ఎగువన చలిస్తే రూ.811 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.798.70 స్థాయిని అధిగమించకుంటే దిద్దుబాటు అవుతుందనే విషయాన్ని ట్రేడర్లు దృష్టిలో పెట్టుకోవాలి.
* సీసం మే కాంట్రాక్టు ఈవారం రూ.173.25 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్ల మద్దతు లభించేందుకు అవకాశం ఉంటుంది. రూ.170.35 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.177.25 లక్ష్యంతో,                రూ.172.05- 173.25 సమీపంలో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవడం మంచి వ్యూహమే అవుతుంది.
* జింక్‌ మే కాంట్రాక్టు ఈవారం రూ.239.55 స్థాయిని నిలబెట్టుకోకపోతే మరింతగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ స్థాయి వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని షార్ట్‌ సెల్‌ వైపు మొగ్గు చూపవచ్చు.
* అల్యూమినియం మే కాంట్రాక్టుకు ఈవారం అధిక స్థాయుల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోవచ్చు. రూ.202.60 స్థాయిని అధిగమించకుంటే కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయొచ్చు.
* నికెల్‌ మే కాంట్రాక్టు ఈవారం రూ.1,323 కంటే దిగువన కదలాడితే రూ.1,297 వరకు దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

ఇంధన రంగం
* సహజవాయువు మే కాంట్రాక్టును ఈవారం రూ.226.80 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ.222- 224.60 దరిదాపులో షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.
* ముడి చమురు మే కాంట్రాక్టు ఈవారం రూ.4,723 కంటే దిగువకు రాకుంటే లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. ఒకవేళ రూ.4,652 కంటే దిగువకు వస్తే మరింతగా పడిపోయేందుకు అవకాశం ఉంటుంది.
* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) మే కాంట్రాక్టుకు ఈవారం కొత్తగా లాంగ్‌ పొజిషన్లు తీసుకోకపోవడమే మంచిది. అదే సమయంలో లాంగ్‌ పొజిషన్లున్న వాళ్లు రూ.1,258 నుంచి లాభాలు స్వీకరించడం మంచిది. అధిక స్థాయుల వద్ద షార్ట్‌ సెల్లింగ్‌ చోటుచేసుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.

వ్యవసాయ ఉత్పత్తులు
* పసుపు మే కాంట్రాక్టు ఈవారం రూ.7,475 కంటే దిగువన ట్రేడయితే రూ.7,363; రూ.7,296 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది.
* జీలకర్ర మే కాంట్రాక్టుకు ఈవారం అధిక స్థాయుల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకునే అవకాశం ఉంది. అందువల్ల లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు రూ.13,987 నుంచి లాభాలు తీసుకోవడం మంచిది. రూ.13,743,  తర్వాత రూ.13,647 వరకు కాంట్రాక్టు దిద్దుబాటు కావచ్చు.
* సోయాబీన్‌ మే కాంట్రాక్టుకు ఈవారం రూ.7,887 దరిదాపులో గట్టి నిరోధం కన్పిస్తోంది. ఈ స్థాయిని అధిగమించకుంటే లాంగ్‌ పొజిషన్లు వదిలించుకుని, షార్ట్‌ సెల్‌ వైపు మొగ్గుచూపడం మంచిది.
* ధనియాలు మే కాంట్రాక్టు ఈవారం రూ.6,861 కంటే ఎగువకు వెళ్లకుంటే దిద్దుబాటు అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని