రిలయన్స్‌ రిటైల్‌ అదుర్స్‌
close

Published : 10/05/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిలయన్స్‌ రిటైల్‌ అదుర్స్‌

ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రిటైలర్లలో రెండో స్థానం

దిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్‌ సంస్థల్లో రెండోస్థానంలో నిలిచింది. డెలాయిట్‌ రూపొందించిన గ్లోబల్‌ రిటైల్‌ పవర్‌ హౌసెస్‌ 2021 ర్యాంకింగ్‌లో రిలయన్స్‌ రిటైల్‌ రెండో స్థానం సాధించింది. ఈ జాబితాలో అమెరికా దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్‌ అగ్రస్థానంలో నిలిచింది. అమెజాన్‌.కామ్‌ రెండో స్థానానికి ఎగబాకింది. కాస్ట్‌కో హోల్‌సేల్‌ కార్పొరేషన్‌ మూడో స్థానానికి దిగింది. జర్మనీకి చెందిన స్క్వార్జ్‌ తరవాత స్థానంలో నిలిచింది. తొలి 10 స్థానాల్లో 7 అమెరికాకు చెందిన సంస్థలుండగా, యూకే నుంచి టెస్కో పీఎల్‌సీ (10వ ర్యాంక్‌) ఉంది. క్రోజెర్‌ కంపెనీ (5), వాల్‌గ్రీన్స్‌ బూట్స్‌ అలియన్స్‌ (6), సీవీఎస్‌ హెల్త్‌ కార్పొరేషన్‌ (9)లు అమెరికా సంస్థలే. జర్మనీకి చెందిన అల్దీ ఇన్‌కాఫ్‌ జీఎంబీహెచ్‌ అండ్‌ అల్దీ ఇంటర్నేషనల్‌ సర్వీసెస్‌ జీఎంబీహెచ్‌ 8వ ర్యాంకు సాధించింది.
* అంతర్జాతీయంగా 250 రిటైలర్ల జాబితాలో భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక కంపెనీ రిలయన్స్‌ రిటైల్‌ కావడం విశేషం. గ్లోబల్‌ పవర్స్‌ ఆఫ్‌ రిటైలింగ్‌, వరల్డ్స్‌ ఫాస్టెస్ట్‌ రిటైలర్స్‌ జాబితాలో రిలయన్స్‌ రిటైల్‌ స్థానం సంపాదించడం ఇది వరుసగా నాలుగోసారి. గ్లోబల్‌ పవర్స్‌ ఆఫ్‌ రిటైలింగ్‌ జాబితాలో గతంలో సాధించిన 56వ ర్యాంకు నుంచి మూడు స్థానాలు ఎగబాకి 53వ స్థానం సాధించినట్లు డెలాయిట్‌ నివేదిక పేర్కొంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని