5Gకి, కరోనాకు సంబంధం లేదు
close

Updated : 11/05/2021 12:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

5Gకి, కరోనాకు సంబంధం లేదు

అవి అసత్య ప్రచారాలు: డాట్‌

దిల్లీ: 5జీ సాంకేతికతకు, కరోనా వ్యాప్తికి మధ్య సంబంధం లేదని టెలికాం విభాగం(డాట్) సోమవారం స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఇటువంటి నిరాధార, తప్పుడు ప్రచారాలను ప్రజలు విశ్వసించరాదని పేర్కొంది. ‘సామాజిక మాధ్యమాల్లో పలు తప్పుదోవ పట్టించే ప్రచారాలు జరుగుతున్నాయి. 5జీ నెట్‌వర్క్‌ పరీక్షల వల్లే కరోనా వ్యాపిస్తోందన్న వదంతులు పుట్టుకొస్తున్నాయి. అసలు పరీక్షలే జరగడం లేదు. అయినా 5జీ సాంకేతికతకు, కరోనాకు సంబంధమే లేదు. అవన్నీ తప్పుడు, అశాస్త్రీయ ప్రచారాలు. మొబైల్‌ టవర్ల నుంచి నాన్‌-అయానైజింగ్‌ రేడియో తరంగాలు, అది కూడా చాలా తక్కువ శక్తితో వెలువడతాయి. అవి జీవించి ఉన్న ఎటువంటి కణాలపై లేదా మానవులపై ఎటువంటి ప్రభావాన్నీ చూపలేవ’ని డాట్‌ వివరించింది. ‘నాన్‌-అయానైజింగ్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌పై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిషన్‌(ఐసీఎన్‌ఐఆర్‌పీ), డబ్ల్యూహెచ్‌ఓ సిఫారసు చేసిన పరిమితుల కంటే 10 రెట్ల భద్రతా నిబంధనల్లో మనం ఉన్నామ’ని డాట్‌ తెలిపింది. పలు దేశాల్లో 5జీ సేవలను ఇప్పటికే ప్రజలు వినియోగిస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని మొబైల్‌ ఆపరేటర్ల సంఘం కాయ్‌ సైతం పేర్కొంది. 


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని