కట్టిన పన్నును రాబట్టుకుంటాం
close

Published : 12/05/2021 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కట్టిన పన్నును రాబట్టుకుంటాం

చర్యలు తీసుకుంటామన్న కెయిర్న్‌

దిల్లీ: అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం భారత్‌ నుంచి 1.7 బిలియన్‌ డాలర్లను తిరిగి రాబట్టుకుంటామని బ్రిటన్‌కు చెందిన కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీ పేర్కొంది. భారత ప్రభుత్వం వెనకటి తేదీ నుంచి 1.2 బిలియన్‌ డాలర్ల(రూ.10,247 కోట్లు) పన్నును విధించగా వడ్డీతో కలిపి 1.7 బిలియన్‌ డాలర్లను ఆ కంపెనీ నుంచి వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది డిసెంబరులో ట్రైబ్యునల్‌ కెయిర్న్‌కు సానుకూలంగా తీర్పునిచ్చింది. విదేశాల్లో భారత్‌కున్న ఆస్తులను జప్తు చేస్తామని కెయిర్న్‌ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని