ప్రమోటర్‌ గ్రూప్‌ నిర్వచనానికి హేతుబద్ధీకరణ
close

Published : 12/05/2021 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రమోటర్‌ గ్రూప్‌ నిర్వచనానికి హేతుబద్ధీకరణ

ప్రతిపాదనలు సిద్ధం చేసిన సెబీ
వచ్చే నెల 10 వరకు అభిప్రాయాల స్వీకరణ

దిల్లీ: ‘ప్రమోటర్‌ గ్రూప్‌’ నిర్వచనాన్ని హేతుబద్ధీకరించడంతో సహా ‘పర్సన్‌ ఇన్‌ కంట్రోల్‌’ కాన్సెప్ట్‌కు మారడం, తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) తరవాత ప్రమోటర్లు, వాటాదార్లకు కనీస లాకిన్‌ పీరియడ్‌ను తగ్గించడం వంటి వాటిపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి ఒక చర్చాపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై వచ్చే నెల 10 వరకు వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించనుంది. ఆ తర్వాత దీనిపై ఒక స్పష్టమైన విధానాన్ని ఆవిష్కరించనుంది. ప్రస్తుతం ఐపీఓలో షేర్లను కేటాయించిన తర్వాత ప్రమోటర్లు కనీసం మూడేళ్ల పాటు 20 శాతం కనీస వాటాను కొనసాగించేలా లాకిన్‌ పీరియడ్‌ అమల్లో ఉండగా, దాన్ని ఏడాదికి పరిమితం చేయాలనే ప్రతిపాదన చేసింది.
కార్పొరేట్‌ పాలనా పద్ధతుల్ని బలోపేతం చేసేందుకు సెబీ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అగ్రశ్రేణి 1,000 నమోదిత కంపెనీలు డివిడెండ్‌ పంపిణీ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది. డివిడెండ్‌ పంపిణీ పాలసీ ఫార్ములేషన్‌ ఇప్పటి వరకు అగ్రశ్రేణి 500 కంపెనీలకే ఉండగా, దాన్ని మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా 1,000 కంపెనీలకు విస్తరించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని