గనుల పరిశ్రమలో 15-20% వృద్ధి
close

Published : 12/05/2021 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గనుల పరిశ్రమలో 15-20% వృద్ధి

నిర్మాణ సామగ్రి రంగం సైతం
2021పై ఇక్రా అంచనాలు

దిల్లీ: గనులు, నిర్మాణ సామగ్రి పరిశ్రమ ఈ ఏడాది (2021) 15-20 శాతం మేర వృద్ధి నమోదు చేయవచ్చని ఇక్రా అంచనా వేసింది. అయితే కరోనా పడగ నీడలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఉన్నట్లుండి ప్రతికూలతల వైపూ నడిచే అవకాశం లేకపోలేదని తెలిపింది. 2021 తొలి త్రైమాసికంలో సామగ్రికి గిరాకీ 45-50 శాతం మేర నమోదైందని తెలిపింది. ఇంకా ఆ కంపెనీ ఏమంటోందంటే..
2020లో గనులు, నిర్మాణ సామగ్రి (ఎమ్‌సీఈ) రంగం 10-12 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా ప్రథమార్ధంలో 39% క్షీణించడం వల్ల ఇది జరిగింది. ఈ నేపథ్యంలో 2021లో 15-20%; 2022లో 5-10 శాతం మేర వృద్ధి నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనా రెండో విడత కారణంగా ఏప్రిల్‌ 2021లో గిరాకీ స్తబ్దుగా మారింది. ఈ తరహా ప్రతికూలతలు ఎదురైతే వృద్ధికి ఇబ్బంది కలగవచ్చు.
2021లో సామగ్రి రంగానికి బలమైన గిరాకీనే కనిపించవచ్చు. 2020లో తక్కువ ప్రాతిపదిక కూడా ఇందుకు కారణం. అయితే తొలి త్రైమాసికంలో బలంగా రాణించిన ఈ రంం రెండో త్రైమాసికంలో సెకండ్‌ వేవ్‌లో చిక్కుకుంది. మూడో, నాలుగో త్రైమాసికాల్లో కొనుగోళ్లకు ముందు పైకి, కొనుగోళ్ల తర్వాత కిందకు గిరాకీ ఊగిసలాడే అవకాశం ఉంది.
ప్రభుత్వం తన ‘బిల్డ్‌ ఇండియా’ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండడం; వ్యవస్థలో సరిపడా ద్రవ్యలభ్యత ఉండడం సామగ్రి పరిశ్రమకు కలిసొచ్చే అంశాలు. పోర్టులు, మెట్రోలు, విమానాశ్రాయాల వంటి ఇతర రంగాల్లో నిర్మాణ కార్యకలాపాలు పుంజుకుంటే అదనపు మద్దతు లభిస్తుంది.
2021తో పాటు గిరాకీ 2022, 2023లోనూ వృద్ధి చెందొచ్చు. 2024లో మాత్రం సాధారణ ఎన్నికలకు ముందు, తర్వాత క్షీణించే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని