సంక్షిప్తంగా
close

Published : 12/05/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్తంగా

కొవిడ్‌ చికిత్సలో వినియోగించేందుకు జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన విరాఫిన్‌ ధరను తాజాగా ప్రకటించింది. ఒక్కో డోసును రూ.11,995కు విక్రయిస్తున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న తయారీ కేంద్రం విస్తరణకు అనుబంధ సంస్థ రూ.135 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సర్దా ఎనర్జీ అండ్‌ మినరల్స్‌ ప్రకటించింది.
యెస్‌ బ్యాంక్‌ ముఖ్య ఆర్థికవేత్తగా ఇంద్రనీల్‌ పాన్‌ నియమితులయ్యారు. ఆయన ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ నుంచి వచ్చారు.
పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సెబీ వద్ద మెడి అసిస్ట్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.
బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా యెస్‌ బ్యాంక్‌లో 2 శాతానికి పైగా వాటాను యాంకర్‌ పెట్టుబడిదారు బే ట్రీ ఇండియా హోల్డింగ్స్‌ విక్రయించింది. వాటా విక్రయం ద్వారా సంస్థ వాటా 5.40 శాతానికి తగ్గింది.
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి మే 31 మధ్య ఉన్న ఉచిత సర్వీసు కాలాన్ని జూన్‌ 30కు టాటా మోటార్స్‌ పొడిగించింది.
పతంజలి నేచురల్‌ బిస్కెట్స్‌ నుంచి బిస్కెట్ల వ్యాపారాన్ని రూ.60 కోట్లకు రుచీ సోయా కొనుగోలు చేసింది. వచ్చే రెండు నెలల్లో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తికానుంది.
హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా వార్షిక నిర్వహణ షట్‌డౌన్‌లో భాగంగా చెన్నైలోని ప్లాంట్‌ను ఈ నెల 15 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
యూరప్‌లో సాఫ్ట్‌ డ్రింక్స్‌ వ్యాపారాలు కొనసాగిస్తున్న దిగ్గజ సంస్థ బ్రిట్విక్‌ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది.
గత ఫిబ్రవరిలో జియో కొత్తగా 42 లక్షల మంది చందాదార్లను జత చేర్చుకోవడంతో మొత్తం చందాదార్ల సంఖ్య 41.49 కోట్లకు చేరుకుందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ పేర్కొంది.
భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్లు ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో 18 శాతం పెరిగి 3.8 కోట్ల యూనిట్లకు చేరినట్లు రీసెర్చ్‌ సంస్థ ఐడీసీ వెల్లడించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని