గ్రో చేతికి ఇండియాబుల్స్‌ ఎమ్‌ఎఫ్‌
close

Published : 12/05/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్రో చేతికి ఇండియాబుల్స్‌ ఎమ్‌ఎఫ్‌

ముంబయి: ఇండియాబుల్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (ఐబీఏఎమ్‌సీ)ను రూ.175 కోట్లతో పూర్తిగా కొనుగోలు చేయనున్నట్లు ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫాం గ్రో ప్రకటించింది. ఆస్తుల నిర్వహణ కంపెనీలను సొంతం చేసుకోవడానికి ఆర్థిక సాంకేతిక(ఫిన్‌టెక్‌) కంపెనీలకు అనుమతులు ఇచ్చాక తొలిసారిగా చోటు చేసుకుంటున్న లావాదేవీ ఇది. కింద స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి కంపెనీ చాలా సమయం తీసుకుందని ఈ సందర్భంగా గ్రో సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ లలిత్‌ కేశ్రే పేర్కొన్నారు. కాగా, మాతృ సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ యధావిధిగా ప్రత్యామ్నాయ పెట్టుబడుల ఫండ్‌(ఏఐఎఫ్‌), పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌(పీఎమ్‌ఎస్‌) వ్యాపారాలను కొనసాగిస్తుంది. ఈ రెండు వ్యాపారాలను  ఏబీఏఎమ్‌సీ నుంచి విడదీస్తారని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫండ్‌ల వ్యాపారంలోకి ఫిన్‌టెక్‌ కంపెనీలకు అనుమతులు ఇచ్చిన నెలల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. కాగా, మిగతా  ఫిన్‌టెక్‌ కంపెనీలూ ఈ రంగంలోకి రావాలని ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాబుల్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణలో మార్చి 2021 నాటికి 13 పథకాల్లో సగటున రూ.663.68 కోట్ల ఆస్తులున్నాయి. మరో వైపు, ఈ విక్రయం ద్వారా మాతృ సంస్థ తన మూలధనాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది. మరోపక్క, గ్రో కంపెనీకి 1.5 కోట్ల వినియోగదార్లున్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని