అర్టివాటిక్‌లో కేఫిన్‌ టెక్‌ పెట్టుబడి
close

Published : 12/05/2021 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అర్టివాటిక్‌లో కేఫిన్‌ టెక్‌ పెట్టుబడి

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్సూరెన్స్‌ టెక్‌ అంకురం అర్టివాటిక్‌.ఏఐలో రిజిస్ట్రీ సేవల సంస్థ కేఫిన్‌ టెక్‌ 17 శాతం వాటా కొనుగోలు చేసింది. దశల వారీగా మెజార్టీ వాటా దక్కించుకునే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల ఇన్సూరెన్స్‌ టెక్నాలజీ ఆధారిత సేవలు అందించటానికి తమకు వీలు కలుగుతుందని కేఫిన్‌ టెక్‌ వెల్లడించింది. ఈ సంస్థ ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్లు, పెన్షన్‌ ఫండ్ల విభాగంలో రిజిస్ట్రీ సేవలు అందిస్తున్న విషయం విదితమే. అర్టివాటిక్‌.ఏఐ బీమా విభాగంలో అండర్‌రైటింగ్‌, క్లెయిముల పరిష్కారం రిస్క్‌- ఫ్రాడ్‌ ఇంటిలిజెన్స్‌, విక్రయాల సమాచార విశ్లేషణ... తదితర పలు రకాలైన విభాగాల్లో ఆటోమేటెడ్‌ సొల్యూషన్లు రూపొందిస్తోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని