సీసీఐ ఆదేశాలపై సమీక్ష జరుపుతున్నాం: టాటా మోటార్స్‌
close

Published : 12/05/2021 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీసీఐ ఆదేశాలపై సమీక్ష జరుపుతున్నాం: టాటా మోటార్స్‌

దిల్లీ: భారత్‌లోని తమ వాణిజ్య వాహన వ్యాపారంపై దర్యాప్తును ప్రారంభించేందుకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) జారీ చేసిన ఆదేశాలపై సమీక్ష జరుపుతున్నామని టాటా మోటార్స్‌ తెలిపింది. డీలర్‌షిప్‌ల ఒప్పందాలకు సంబంధించి గుత్తాధిపత్యాన్ని టాటా మోటార్స్‌ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలపై ఈ ఆదేశాలను గతవారం సీసీఐ జారీ చేసింది. టాటా మోటార్స్‌కు చెందిన రెండు కంపెనీలు టాటా కేపిటల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన సీసీఐ.. వాణిజ్య వాహనాలకు సంబంధించి డీలర్‌షిప్‌లతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో అసమంజసమైన షరతులను టాటా మోటార్స్‌ విధించిందనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. తద్వారా కాంపిటీషన్‌ చట్టంలోని సెక్షన్‌ 5లోని నిబంధనలకు వ్యతిరేకంగా తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని