వరుస లాభాలకు అడ్డుకట్ట
close

Updated : 12/05/2021 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుస లాభాలకు అడ్డుకట్ట

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లకు అమ్మకాలు
సమీక్ష

నాలుగు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. కమొడిటీ ధరలు దూసుకెళ్లడంతో ద్రవ్యోల్బణ భయాలు అంతర్జాతీయ మార్కెట్లను పడేశాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. ఇటీవల పెరిగిన బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, లోహ షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది. ప్రభుత్వ రంగ సంస్థ షేర్లకు కొనుగోళ్ల మద్దతు దక్కింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.34 వద్ద స్తబ్దుగా ముగిసింది. .
సెన్సెక్స్‌ ఉదయం 49,066.45 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కదలాడిన సూచీకి పెరిగినప్పుడల్లా అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఒకానొకదశలో 48,988.18 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయిన సెన్సెక్స్‌.. చివరకు 340.60 పాయింట్ల నష్టంతో 49,161.81 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 91.60 పాయింట్లు కోల్పోయి 14,850.75 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 14,771.40- 14,900 పాయింట్ల మధ్య కదలాడింది.
సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 డీలాపడ్డాయి. కోటక్‌ బ్యాంక్‌ అత్యధికంగా 3 శాతం కుదేలైంది. హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హిందుస్థాన్‌ యునిలీవర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.68 శాతం వరకు నష్టపోయాయి. ఎన్‌టీపీసీ 4.60%, ఓఎన్‌జీసీ 3.69%, పవర్‌గ్రిడ్‌ 1.66%, సన్‌ఫార్మా 1.39%, అల్ట్రాటెక్‌ 1.27% మేర లాభపడ్డాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని