కొవిడ్‌-19కు ఆయుర్వేద టీకా?
close

Published : 14/05/2021 05:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌-19కు ఆయుర్వేద టీకా?

మెగాల్యాబ్‌కు రూ.300 కోట్ల నిధులు

ముంబయి: కొవిడ్‌-19 వ్యాధికి ఆయుర్వేద టీకా ఆవిష్కరించే యత్నాల్లో నిమగ్నమైన మెగాల్యాబ్‌కు రూ.300 కోట్ల నిధులు లభించాయి. ఐఐటీ పూర్వవిద్యార్థుల మండలి (అలూమ్ని కౌన్సిల్‌) మద్దతు గల మెగాల్యాబ్‌ ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానాల ఆధారంగా రెండు డోసుల కొవిడ్‌-19 టీకా తయారీకి కొంతకాలంగా పనిచేస్తోంది. ఈ టీకా వచ్చే 6 నెలల వ్యవధిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఐఐటీ పూర్వవిద్యార్థుల మండలి అధ్యక్షుడు రవి శర్మ తెలిపారు. ఈ ఆయుర్వేద టీకాను రెండు డోసులుగా ఇంజెక్షన్‌ రూపంలో, నోటిలో/ ముక్కులో వేసుకునే చుక్కల రూపంలో తయారు చేసే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. తొలి దశలో ఈ టీకాను ఐఐటీ పూర్వవిద్యార్థులకు అందిస్తామని అన్నారు. ఈ ప్రయత్నానికి అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన బయోటెక్నాలజీ నిపుణుడు డాక్టర్‌ అరిందమ్‌ బోస్‌ నాయకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆయన ఫైజర్‌లో టీకా తయారీ విభాగానికి అధిపతిగా పనిచేశారు. ఐఐటీ బాంబే పూర్వవిద్యార్ధి అయిన డాక్టర్‌ శాంతారామ్‌ కానే ఇంజక్టబుల్‌ అడ్జువంట్‌, నోటిలో/ ముక్కులో వేసుకునే చుక్కల టీకా పదార్థాల విభాగానికి నాయకత్వం వహిస్తారన్నారు. మెగాల్యాబ్‌ వివిధ డయాగ్నస్టిక్స్‌ సంస్థలు, ఇతర టెక్నాలజీ కంపెనీలతో భాగస్వామ్యాల కోసమూ ప్రయత్నాలు చేస్తోంది. ఐఐటీ అలూమ్ని ప్రపంచంలోని అతిపెద్ద పూర్వవిద్యార్థుల సంస్థ కావటం ప్రత్యేకత. దీన్లో 23 ఐఐటీలకు చెందిన పూర్వవిద్యార్థులు ఉన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని