పిల్లలకు కొవాగ్జిన్‌ టీకా
close

Published : 14/05/2021 05:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లలకు కొవాగ్జిన్‌ టీకా

525 మందిపై పరీక్షలు నిర్వహించనున్న భారత్‌ బయోటెక్‌

దిల్లీ: కొవిడ్‌-19 టీకా కొవాగ్జిన్‌ను 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలకు ఇచ్చేందుకు వీలుగా క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు అనుమతి పొందిన భారత్‌ బయోటెక్‌, దాన్ని 525 మందిపై పరీక్షించనుంది. రెండు, మూడు దశల క్లినికల్‌ పరీక్షల్లో ఆరోగ్యవంతులైన 525 మంది వాలంటీర్లు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పిల్లలపై ఈ టీకా ఏమేరకు పనిచేస్తుందో తెలుసుకోడానికి క్లినికల్‌ పరీక్షలు నిర్వహించాలని భారత్‌ బయోటెక్‌ ప్రతిపాదించగా, అందుకు భారత ఔషధ నియంత్రణ మండలి, దానికి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ అంగీకరించిన విషయం తెలిసిందే. ‘కొవాగ్జిన్‌’ టీకాను ఇప్పటికే పెద్దలకు ఇస్తున్న విషయం గమనార్హం. భవిష్యత్తులో పిల్లలకు కూడా అనువైనదిగా దీన్ని తీర్చిదిద్దాలని భారత్‌ బయోటెక్‌ భావిస్తోంది. అందుకే క్లినికల్‌ పరీక్షలు చేపట్టబోతోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని