మొబిక్విక్‌లో వాటా తగ్గించుకుంటాం
close

Published : 15/05/2021 05:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొబిక్విక్‌లో వాటా తగ్గించుకుంటాం

బజాజ్‌ ఫైనాన్స్‌ ఎండీ రాజీవ్‌ జైన్‌

ముంబయి: చెల్లింపు సేవల సంస్థ మొబిక్విక్‌ ప్రతిపాదిత ఐపీఓలో తమ సంస్థకున్న వాటా తగ్గించుకుంటామని బజాజ్‌ ఫైనాన్స్‌ ఎండీ రాజీవ్‌ జైన్‌ వెల్లడించారు. మొబిక్విక్‌లో ఈ సంస్థకు 13.5 శాతం వాటా ఉంది. వ్యవస్థాపకులు ఎంత మొత్తంలో వాటాలను ఐపీఓలో తగ్గించుకుంటారో, అంతే స్థాయిలో మేము కూడా తగ్గించుకుంటామని జైన్‌ వివరించారు. సెప్టెంబరులో మొబిక్విక్‌ 200-250 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1,500-1,875 కోట్లు) ఐపీఓకు వచ్చేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఈ ఐపీఓతో మొబిక్విక్‌ విలువ 1 బిలియన్‌ డాలర్లపైనే (సుమారు రూ.7,500 కోట్లు) ఉంటుందని తెలుస్తోంది.
* బజాజ్ ఫైనాన్స్‌ 2017లో మొబిక్విక్‌లో 11 శాతం వాటా కొనుగోలు చేసింది. తరవాత మూలధన సాయం ద్వారా వాటాను 13.5 శాతానికి పెంచుకుంది. మొబిక్విక్‌తో భాగస్వామ్యం కొనసాగిస్తూనే, తమ సొంత పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నట్లు జైన్‌ వివరించారు. సెమీ-క్లోజ్డ్‌ ప్రీపేమెంట్‌ పేమెంట్స్‌ వ్యాపారం నిర్వహించేందుకు బజాజ్‌ ఫైనాన్స్‌కు ఇటీవలే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి ఇచ్చింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని