ఎగుమతిదార్ల పన్ను రిఫండ్‌ పథకం రేట్లను 2 వారాల్లో ప్రకటించొచ్చు
close

Published : 15/05/2021 05:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎగుమతిదార్ల పన్ను రిఫండ్‌ పథకం రేట్లను 2 వారాల్లో ప్రకటించొచ్చు

విదేశీ వాణిజ్య డైరెక్టర్‌ జనరల్‌ అమిత్‌ యాదవ్‌

దిల్లీ: ఎగుమతిదార్ల కోసం ఉద్దేశించిన పన్ను రిఫండ్‌ పథకం రేట్లను రెండు వారాల్లో ప్రకటించే అవకాశం ఉందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) అమిత్‌ యాదవ్‌ శుక్రవారం వెల్లడించారు. ప్రభుత్వం గత ఏడాది రెమిషన్‌ ఆఫ్‌ డ్యూటీస్‌ అండ్‌ ట్యాక్సెస్‌ ఆన్‌ ఎక్స్‌పోర్టెడ్‌ ప్రోడక్ట్స్‌ (ఆర్‌ఓడీటీఈపీ) పథకానికి ఆమోదం తెలిపింది. దేశం నుంచి ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు జనవరి 1 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మరో రెండు వారాల్లో ఆర్‌ఓడీటీఈపీ పథకం రేట్లను ప్రకటించొచ్చని  అమిత్‌ యాదవ్‌ వెల్లడించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని