2021-22లో వృద్ధి రేటు 8 శాతమే: హెచ్‌ఎస్‌బీసీ
close

Published : 15/05/2021 05:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2021-22లో వృద్ధి రేటు 8 శాతమే: హెచ్‌ఎస్‌బీసీ

3.2 శాతం అంచనాల తగ్గింపు

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత వృద్ధి రేటు 8 శాతంగా నమోదు కావొచ్చని హెచ్‌ఎస్‌బీసీ అంచనా వేసింది. సంస్థ గతంలో వేసిన అంచనాతో పోలిస్తే ఏకంగా 320 బేసిస్‌ పాయింట్లు తగ్గించడం గమనార్హం. కొవిడ్‌ రెండో దశ విజృంభణ నేపథ్యంలో ఆర్థిక వేత్తలు వృద్ధి రేటు అంచనాఉ తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రేటింగ్‌ సంస్థలు సుమారు 10 శాతం జీడీపీ వృద్ధి రేటు ఉండొచ్చని అంచనా వేయగా, హెచ్‌ఎస్‌బీసీ 8 శాతానికి పరిమితం చేసింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక వృద్ధిపై వివిధ రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ల ప్రభావం వల్ల మార్చి త్రైమాసికంతో పోలిస్తే, జూన్‌ త్రైమాసికంలో 13 శాతం క్షీణత నమోదు చేసే అవకాశం ఉందని హెచ్‌ఎస్‌బీసీ వెల్లడించింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో కూడా అనిశ్చితులు కొనసాగొచ్చని, అక్టోబరు-మార్చి త్రైమాసికాల్లో ఎక్కువ మంది జనాభాకు టీకాల కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉండటంతో ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకునే అవకాశం ఉందని పేర్కొంది. 2022-23లో వృద్ధి అంచనాలను 20 బేసిస్‌ పాయింట్లు (6%) పెంచింది. ఇదిలా ఉంటే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతం వృద్ధి ఉండొచ్చని ఇటీవల అంచనా వేసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని