ఐరోపాలో బాస్మతి బియ్యానికి ‘భారత్‌’ ముద్ర
close

Published : 15/05/2021 05:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐరోపాలో బాస్మతి బియ్యానికి ‘భారత్‌’ ముద్ర

జీఐ కోసం తుది దశకు ఒప్పంద ప్రక్రియ

ఈనాడు, దిల్లీ: భారత బాస్మతి బియ్యానికి భౌగోళిక ధ్రువీకరణ (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌/ జీఐ) నిమిత్తం ఐరోపా కూటమితో (ఈయూ) భారత్‌ ఒప్పంద ప్రక్రియ తుది దశకు చేరింది. ప్రతిపాదిత ఒప్పందం పూర్తయితే.. భారత్‌ నుంచి ఐరోపా కూటమికి బాస్మతి బియ్యం ఎగుమతులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈయూకి బాస్మతి బియ్యం ఎగుమతుల విలువ రూ.1,833 కోట్లుగా ఉంది. వచ్చే ఒకటి రెండేళ్లలో ఇది రూ.3,667 కోట్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. బాస్మతి బియ్యానికి ఐరోపా కూటమితో జీఐ ఒప్పందం పూర్తయితే.. జౌళి, చేనేతకు కూడా జీఐ ఒప్పందం కుదిరేందుకు అవకాశాలు ఏర్పడతాయని ఓ అధికారి వెల్లడించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడుల బంధాలను పెంచుకునేందుకు భారత్‌, ఈయూలు గతవారం ఓ అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల పరిరక్షణ, జీఐ లాంటి రెండు కీలక అంశాలపై చర్యలను ప్రారంభించేందుకు కూడా ఇరు పక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని