జియోఫోన్‌ వినియోగదారులకు 300 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌
close

Published : 15/05/2021 05:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జియోఫోన్‌ వినియోగదారులకు 300 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌

దిల్లీ: కరోనా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రిలయన్స్‌ జియో కొత్త ఆఫర్‌ ప్రకటించింది. జియోఫోన్‌ వినియోగదారులకు రోజుకు 10 నిమిషాల చొప్పున.. నెలకు 300 నిమిషాల పాటు ఉచితంగా ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ చేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లు, ఇందుకోసం రిలయన్స్‌ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రీఛార్జి చేసుకోలేని జియోఫోన్‌ వినియోగదారులకు ఈ పథకం లభిస్తుందని తెలిపింది. జియోఫోన్‌ ప్లాన్‌ రీఛార్జి చేసుకునే ప్రతి వినియోగదారుడికి అదే విలువ కలిగిన అదనపు రీఛార్జి ప్లాన్‌ను ఉచితంగా అందించనున్నట్లు జియో పేర్కొంది. ఉదాహరణకు రూ.75 ప్లాన్‌తో రీఛార్జి చేసుకుంటే.. అదనంగా రూ.75 ప్లాన్‌ను పూర్తి ఉచితంగా పొందొచ్చు. ఈ ఆఫర్లు వార్షిక లేదా జియోఫోన్‌ అనుసంధానిత పథకాలకు వర్తించవని స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని