ఎగుమతులు మూడింతలు
close

Published : 15/05/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎగుమతులు మూడింతలు

దిల్లీ: భారత ఎగుమతులు ఏప్రిల్‌ నెలలో దాదాపు మూడింతలై 30.63 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. రత్నాభరణాలు, ఇంజినీరింగ్‌ వంటి రంగాల్లో మెరుగైన వృద్ధి చోటు చేసుకోవడంతో ఇది సాధ్యమైంది. శుక్రవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలను విడుదల చేసింది. దిగుమతులు సైతం మూడింతలకు పైగా పెరిగి 45.72 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడంతో వాణిజ్య లోటు 15.1 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఏప్రిల్‌ 2020లో గణాంకాలు తక్కువగా నమోదుకావడం కూడా ఈసారి వృద్ధి అధికంగా నమోదయ్యేందుకు కారణమైంది. గతేడాది ఏప్రిల్‌లో ఎగుమతులు 60.28% మేర క్షీణించాయి. ఈ ఏడాది మార్చిలో ఎగుమతులు 60.29% మేర పెరిగి 34.45 బిలియన్‌ డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని