ఒడుదొడుకులమయం
close

Published : 15/05/2021 05:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒడుదొడుకులమయం

సెన్సెక్స్‌కు లాభం, నిఫ్టీకి నష్టం
సమీక్ష

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ స్వల్ప లాభంతో బయటపడగా, నిఫ్టీకి మాత్రం నష్టం తప్పలేదు. ఏషియన్‌ పెయింట్స్‌, ఆర్‌ఐఎల్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడి 73.29 వద్ద ముగియడం ఇందుకు తోడైంది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌, టోక్యో, సియోల్‌ రాణించాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్‌ ఉదయం 48,898.93 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అయితే వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులు చవిచూసింది. ఒకానొకదశలో 48,473.43 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయిన సూచీ.. మళ్లీ కోలుకుని 41.75 పాయింట్ల లాభంతో 48,732.55 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 18.70 పాయింట్లు తగ్గి 14,677.80 దగ్గర స్థిరపడింది. వారం ప్రాతిపదికన.. సెన్సెక్స్‌ 473.92 పాయింట్లు, నిఫ్టీ 145.35 పాయింట్లు చొప్పున నష్టాలు నమోదుచేశాయి.

* పవర్‌గ్రిడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ ఇష్యూ ధరైన రూ.100తో పోలిస్తే 4 శాతం లాభంతో రూ.104 వద్ద ప్రారంభమైంది. చివరకు 3 శాతం లాభంతో రూ.103 వద్ద ముగిసింది.                                            
సెన్సెక్స్‌ 30 షేర్లలో 10 లాభపడ్డాయి. ఏషియన్‌ పెయింట్స్‌ అత్యధికంగా 8.51 శాతం దూసుకెళ్లింది. ఐటీసీ 4.45 శాతం, నెస్లే 3.01 శాతం, ఎల్‌ అండ్‌ టీ 2.21 శాతం, హెచ్‌యూఎల్‌ 2.05 శాతం, రిలయన్స్‌ 1.22 శాతం చొప్పున రాణించాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా మాత్రం 2.82 శాతం వరకు నష్టపోయాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని