రూ.4,765 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం
close

Published : 17/05/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.4,765 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం

ఐపీఓలకు సిద్ధమైన 4 కంపెనీలు

దిల్లీ: తాజాగా తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) వచ్చేందుకు మరో 4 కంపెనీలు సిద్ధమవుతున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఈ మేరకు ముసాయిదా పత్రాలు కూడా దాఖలు చేశాయి. ఈ సంస్థలు ఎంత మేర నిధులు సమీకరించాలనుకుంటున్నాయి తదితర వివరాలు ఇవిగో..
* విండ్లాస్‌ బయోటెక్‌ రూ.165 కోట్ల పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమైంది. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌, డీఏఎమ్‌ క్యాపిటల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.
* ఆప్టస్‌ వాల్యూ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రూ.3,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించనున్నాయి.
* కృష్ణా డయాగ్నోస్టిక్స్‌ రూ.400 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. జేఎం ఫైనాన్షియల్‌, డీఏఎమ్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, ఎంక్వైరీస్‌ క్యాపిటల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించనున్నాయి.
* సుప్రియ లైఫ్‌సైన్స్‌ రూ.1,200 కోట్ల తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు రాబోతోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌ ఈ ఐపీఓకు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించనున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని