జప్తు కోసం 70 బి. డాలర్ల భారత ఆస్తులు!
close

Published : 17/05/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జప్తు కోసం 70 బి. డాలర్ల భారత ఆస్తులు!

గుర్తించిన కెయిర్న్‌

దిల్లీ: బ్రిటన్‌కు చెందిన కెయిర్న్‌ ఎనర్జీ భారత ప్రభుత్వం నుంచి 1.72 బిలియన్‌ డాలర్లను తిరిగి పొందడం కోసం విదేశాల్లో ఉన్న 70 బిలియన్‌ డాలర్ల విలువైన భారత ఆస్తులను గుర్తించింది. ఇదే జరిగితే ఆర్బిట్రేషన్‌ తీర్పుల ప్రకారం చెల్లింపులు చేయడంలో విఫలమై, బలవంతంగా ఆస్తుల జప్తునకు గురైన పాకిస్థాన్‌, వెనెజువెలా దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరుతుంది. ఎయిరిండియాకు చెందిన విమానాలు; షిప్పింగ్‌ కార్పొరేషన్‌కు చెందిన వెసెల్స్‌, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు చెందిన ఆస్తులు కెయిర్న్‌ గుర్తించిన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘భారత్‌ సాధారణంగానే ఈ తరహా జప్తును సవాలు చేస్తుంది. అందుకు బదులుగా బ్యాంకు హామీలను ఇవ్వొచ్చు. ఒక వేళ కెయిర్న్‌ కేసులో బలం లేకపోతే ఆ హామీలు తిరిగి భారత్‌కు ఇచ్చేస్తారు. ఒక వేళ భారత్‌కు పరిస్థితులు సానుకూలంగా లేకపోతే ఆ హామీలన్నీ కెయిర్న్‌కు వెళ్లొచ్చ’ని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని