పామోలిన్‌లో లాభాల స్వీకరణ
close

Published : 17/05/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పామోలిన్‌లో లాభాల స్వీకరణ

బంగారం

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.48,144 కంటే ఎగువన ట్రేడ్‌ కాకుంటే కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గత నాలుగు వారాలుగా లాంగ్‌ పొజిషన్లను కొనసాగిస్తున్న ట్రేడర్లు రూ.47,911- 47,678 దరిదాపుల్లో లాభాలను స్వీకరించడం మంచిది. ఒకవేళ కిందకు వస్తే రూ.47,444 వద్ద గట్టి మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని నిలబెట్టుకోకపోతే రూ.46,744 వరకు పడిపోవచ్చు. షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోదలిస్తే పై సాంకేతిక స్థాయిలను దృష్టిలో ఉంచుకొని ట్రేడ్‌ చేయడం మంచిది. ఈ వారంలో విడుదలయ్యే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఏప్రిల్‌ నెల సమావేశ ముఖ్యాంశాలు, ఇతర కీలక ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు కూడా కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ మే కాంట్రాక్టు ఈవారం రూ.15,149 కంటే ఎగువన ట్రేడ్‌ కాకుంటే రూ.14,820; రూ.14,668 వరకు దిగివచ్చే అవకాశం ఉంటుంది.

వెండి

వెండి జులై కాంట్రాక్టుకు ఈవారం రూ.72,491 స్థాయిపై కన్నేసి ఉంచాలి. ఈ స్థాయిని నిలబెట్టుకోవడంలో కాంట్రాక్టు విఫలమైతే దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.72,491 స్థాయిని అధిగమిస్తే రూ.73,902 వరకు కాంట్రాక్టు రాణిస్తుందని భావించవచ్చు.

ప్రాథమిక లోహాలు

* ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ మే కాంట్రాక్టు ఈవారం రూ.15,177 కంటే కిందకు రాకుంటే కొంత సానుకూల ధోరణికి అవకాశం ఉంటుంది.
* రాగి మే కాంట్రాక్టు ఈవారం రూ.796 ఎగువన చలించకుంటే దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.801.30 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని షార్ట్‌ సెల్‌ పొజిషన్లు కొనసాగించవచ్చు.
* సీసం మే కాంట్రాక్టు ఈవారం రూ.176.90 కంటే ఎగువన కదలాడకుంటే మరింత కిందకు దిగివచ్చే అవకాశం ఉంటుంది. రూ.175.05-173.35 దిగువన కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌చేయొచ్చు.
* జింక్‌ మే కాంట్రాక్టు ఈవారం రూ.240.50 ఎగువకు వెళ్లకుంటే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. రూ.242.35 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.235.85 దిగువన కాంట్రాక్టుకు షార్ట్‌ సెల్‌పొజిషన్లు తీసుకోవచ్చు.
* అల్యూమినియం మే కాంట్రాక్టు ఈవారం రూ.202.95 స్థాయిని అధిగమించకుంటే లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు లాభాలను స్వీకరించి, షార్ట్‌ సెల్‌ వైపు మొగ్గు చూపడం మంచిది.
* నికెల్‌ మే కాంట్రాక్టుకు ఈ వారం అధిక స్థాయిల వద్ద మరింత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చు. రూ.1,281 కంటే దిగువన ట్రేడయితే రూ.1,239 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది.

ఇంధన రంగం

* సహజవాయువు మే కాంట్రాక్టును ఈవారం రూ.223 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని పెరిగినప్పుడల్లా షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.  
* ముడి చమురు మే కాంట్రాక్టు ఈవారం రూ.4,673 కంటే దిగువన ట్రేడయితే రూ.4,542కు;  ఆతర్వాత రూ.4,419 వరకు దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) మే కాంట్రాక్టుకు ఈవారం రూ.1,264 వద్ద నిరోధం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా లాంగ్‌ పొజిషన్లకు వెళ్లకపోవడం మంచిదే. ఇప్పటికే లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు రూ.1,251 నుంచి లాభాలను స్వీకరించడం మంచి వ్యూహం అవుతుంది.

వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు మే కాంట్రాక్టును ఈవారం రూ.7,526 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.7,916; రూ.8,056 లక్ష్యంతో ధర తగ్గినప్పుడల్లా లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.
* జీలకర్ర మే కాంట్రాక్టుకు ఈవారం రూ.13,880 దిగువన ట్రేడయితే.. ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. రూ.13,581 స్థాయికి కాంట్రాక్టు దిగివచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పైకి వెళితే రూ.14,338 వద్ద కాంట్రాక్టుకు నిరోధం కన్పిస్తోంది.
* ధనియాలు మే కాంట్రాక్టు ఈవారం రూ.6,598 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే లాంగ్‌ పొజిషన్ల వైపు మొగ్గు చూపడం మంచిదే.
* సోయాబీన్‌ మే కాంట్రాక్టు ఈవారం రూ.7,619 కంటే ఎగువన కదలాడకుంటే రూ.7,171; రూ.7,098 లక్ష్యంతో ధర పెరిగినప్పుడల్లా కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయొచ్చు.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని