విమాన ఛార్జీలు 1 నుంచి పెరుగుతాయ్‌ - flight tikcet charges hike from June 1st
close

Published : 29/05/2021 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విమాన ఛార్జీలు 1 నుంచి పెరుగుతాయ్‌

దిల్లీ: దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. విమానయాన ఛార్జీల దిగువ పరిమితిని జూన్‌ 1 నుంచి 13 - 16 శాతం పెంచుతూ పౌరవిమానయాన శాఖ శుక్రవారం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. ఎగువ పరిమితిలో మాత్రం మార్పు చేయలేదు కేంద్రం ఉత్తర్వుల మేరకు.. 40 నిమిషాల విమాన ప్రయాణానికి ఛార్జీల దిగువ పరిమితి రూ. 2,300 నుంచి రూ. 2,600లకు పెరుగుతుంది. 40-60 నిమిషాల ప్రయాణానికి దిగువ పరిమితి ఛార్జీ ప్రస్తుతం రూ. 2,900 ఉండగా అది రూ. 3,300కి పెరుగుతుంది. 60-90 నిమిషాల ప్రయాణానికి రూ.4000, 90-120 ని.కు రూ.4700, 120-150 ని.కు రూ.6100, 180-210 ని.కు 8700 దిగువ పరిమితిగా ఉండనుంది.
ఇక 50% విమానాలే: దేశీయ విమానయాన సంస్థలు కొవిడ్‌ ముందటితో పోలిస్తే, జూన్‌ ఒకటో తేదీ నుంచి 50 శాతం విమానాలు మాత్రమే నడపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశించింది. కొవిడ్‌-19 కేసులు భారీగా పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సంస్థలు 80 శాతం సామర్థ్యంతో నిర్వహించవచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని