‘ అంతర్జాతీయం’ పుంజుకుంటోంది
close

Published : 01/06/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ అంతర్జాతీయం’ పుంజుకుంటోంది

అయితే సవాళ్లు చాలా ఉన్నాయ్‌
ఓఈసీడీ అంచనాలు

ఫ్రాంక్‌ఫర్ట్‌: కరోనా నుంచి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, అయితే పలు సవాళ్లు ఎదురుకావొచ్చని ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(ఓఈసీడీ) పేర్కొంది. పేద దేశాల్లో టీకాల కొరత కారణంగా కొవిడ్‌ కొత్త వేరియంట్లు వ్యాపిస్తూ, మరిన్ని లాక్‌డౌన్‌లకు దారితీస్తుండడమే అత్యంత ఆందోళనకర అంశమని తెలిపింది. దీని వల్ల ఆ దేశాలు మరింత పేదరికంలోకి జారిపోవచ్చని అంచనా వేసింది. ఈ సంస్థ తాజాగా ప్రచురించిన ఆర్థిక భవిష్యత్‌ అంచనాల ప్రకారం.. ‘అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా వరకు ఉద్దీపన చర్యలు చేపట్టడం వల్ల కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోంది. అంతర్జాతీయ వృద్ధి 5.8 శాతం మేర నమోదు కావొచ్చు. డిసెంబరు  అంచనా 4.8 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ. గతేడాది 3.5 శాతం మేర ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.9 శాతం మేర వృద్ధి చెందొచ్చు. అంతక్రితం అంచనా 6.5 శాతంగా ఉంది.’ కాగా, ఇటీవలి నెలల్లో ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడుతున్నప్పటికీ.. ఆరోగ్య పరిస్థితుల్లో మాత్రం అనిశ్చితి కొనసాగవచ్చని ఓఈసీడీ ముఖ్య ఆర్థికవేత్త లారెన్స్‌ బూనే పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని