మేలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.02 లక్షల కోట్లు
close

Published : 06/06/2021 04:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.02 లక్షల కోట్లు

ఏప్రిల్‌తో పోలిస్తే 27%  తగ్గాయ్‌

దిల్లీ: వరుసగా ఎనిమిదో నెలా జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) వసూళ్లు రూ.లక్ష కోట్లకు మించి నమోదయ్యాయి. మేలో రూ.1.02 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూలయ్యింది. అయితే ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్‌టీ వసూళ్లు 27 శాతం తగ్గగా.. కిందటేడాది మేతో పోలిస్తే 65 శాతం పెరిగాయి. ‘2021 మేలో స్థూలంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.1.02,709 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో సీజీఎస్‌టీ 17,592 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్‌టీ రూ.22,653 కోట్లు. ఇక ఐజీఎస్‌టీ రూ.53,199 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.26,002 కోట్లతో కలిపి), సుంకాలు రూ.9,265 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.868 కోట్ల సుంకాలతో కలిపి)గా ఉన్నాయ’ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వరుసగా ఎనిమిదో నెలా జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను మించడం.. ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 ప్రభావం పరిమితంగా ఉందనే సంకేతాన్ని ఇస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కిందటేడాది మేతో పోలిస్తే 2021 మేలో వస్తువుల దిగుమతులపై జీఎస్‌టీ వసూళ్లు 56 శాతం పెరగగా... దేశీయ లావాదేవీల జీఎస్‌టీ వసూళ్లలో 69 శాతం వృద్ధి ఉంది. కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో మే నెల 20వ తేదీలోగా సమర్పించాల్సిన రిటర్న్‌లకు గడువు తేదీలను ప్రభుత్వం పొడిగించింది. రూ.5 కోట్లకు మించి టర్నోవరు ఉన్న పన్ను చెల్లింపుదార్లకు జూన్‌ 4 వరకు రిటర్న్‌ దాఖలు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ప్రకటించిన జీఎస్‌టీ వసూళ్ల గణాంకాల్లో జూన్‌ 4 వరకు దేశీయంగా నమోదైన వసూళ్ల గణాంకాలు కూడా కలిపి ఉన్నాయి. రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవరు ఉన్న పన్ను చెల్లింపుదార్లకు వడ్డీ, ఆలస్యం రుసుం లేకుండా జులై మొదటి వారం వరకు రిటర్న్‌లు దాఖలు చేసుకునే వీలుంది. అందువల్ల ఈ గడువు కూడా ముగిస్తేనే మే నెల జీఎస్‌టీ వసూళ్లపై పూర్తి స్పష్టత వస్తుందని, ఇప్పుడు వెల్లడించిన దాని కంటే కూడా వసూళ్లు ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని